MP: 4 held for forcing Woman to follow regressive ritual మహిళను గ్రామంలో ఊరేగించిన కేసులో నలుగురు అరెస్టు

Mp woman beaten forced to carry child on shoulders for 3 km as punishment

woman, regressive tradition, Punishment, Superintendent of Police (SP), Rajiv Mishra, four arrested, in-laws, Tribal Woman, Viral Video, Tribal Woman Forced To Carry In-Law, Guna district, Video viral, viral video, Guna, madhya pradesh, Crime

A viral video surfaced in Madhya Pradesh's Guna district, in which a tribal woman was forced to follow the regressive ritual of carrying her ex-husband's brother on her shoulders for living with another man. Meanwhile, the police have arrested four accused related to the case of viral video.

ITEMVIDEOS: మహిళను గ్రామంలో ఊరేగించిన కేసులో నలుగురు అరెస్టు

Posted: 02/16/2021 12:08 PM IST
Mp woman beaten forced to carry child on shoulders for 3 km as punishment

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో అటవిక న్యాయాలు ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. కులసంఘాలు, పెద్దలు అనాగరిక తీర్పులు, శిక్షలు దేశ న్యాయవ్యవస్థనే సవాలు చేసేలా వున్నాయి. భర్తను వదిలి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోందన్న కారణంగా ఓ గిరిజన మహిళకు అమె కుటుంబసభ్యులు వేసిన శిక్ష దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వీడియోలో నెట్టింట్లో పెను సంచలనంగా మారడంతో కేసును నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన చర్యలు తీసుకుని అమెకు శిక్ష వేసిన నలుగురిని అరెస్టు చేశారు.

ఈ మహిళను గ్రామానికి తీసుకువచ్చిన అమె అత్తింటివారు.. సదరు మ‌హిళ భుజాల‌పై అమె మరిదిని ఎక్కించి గ్రామంలో ఊరేగించారు. ఈ మేరకు అమెకు ఈ శిక్షను విధించారు గ్రామ పెద్దలు. ఇలా ఆమె దాదాపు మూడు కిలోమీట‌ర్లు తన మరిదిని భుజాల‌పై మోసుకుంటూ నడిచింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో ఉంటోంది.

దీంతో గ్రామస్థులు ఆమె అత్తింటివారితో క‌లిసి ఆమెకు బుద్ధి చెప్పాల‌ని ఆటవిక న్యాయంతో వ్యవహరించి శిక్షను విధించారు. అమె తన భర్త సోదరుడ్ని (మరిదిని) తన భుజాలపై మోస్తూ శిక్ష అనుభ‌వించాల‌ని చెప్ప‌డంతో ఆమె వారిని ఎదిరించ‌లేక‌పోయింది. కాళ్లకు చెప్పులు లేకుండా తన మరిదిని తన భుజాలపే ఎక్కించుకుని ఏకంగా మూడు కిలోమీటర్లు మేర ఊరేగించేలా చేశారు. అమె చుట్టూ చేరిన మె బంధువులలోని మగవారు.. అమె వెంట కర్రలు చేతబట్టి మరీ నడిచారు.ఈ దృశ్యాలను కొంద‌రు స్మార్ట్ ఫోన్లలో తీసి జరిగిన అన్యాయాన్ని నెట్టింట్లో పోస్టు చేశారు.

ఓ గిరిజన మహిళ పట్ల అమానవీయ రీతిలో శిక్షను విధించిన గ్రామ పెద్దలు, కుల పెద్దలు.. తీసుకున్న నిర్ణయాన్ని నెట్టింట్లో ప్రశ్నించారు. అంతేకాదు ఆమెను అవ‌మానిస్తూ గ్రామ‌స్థులు, అత్తింటివారు పాల్ప‌డిన ఈ ఘ‌ట‌నను వివరించారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఇంకేముందు అలా పోలీసులకు కూడా సమాచారం అందింది. దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుణ జిల్లా ఎస్సీ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ ఘటన ఈ నెల 9న జరిగిందని, అయితే తాను జిల్లా ఎస్పీగా 10న బాధ్యతలు చేపట్టానని, అయినా కేసును సత్వర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles