HC directs Registrar General to file case against IAS మిషన్ బిల్డఫ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు హైకోర్టు అదేశం..

Ap high court issues notices to mission build ap official directs registrar general to file case

Andhra Pradesh High Court, IAS Praveen Kumar, Mission Build AP, AP State government, Amaravati, Amaravati latest news, Andhra Pradesh, politics, crime

The Andhra Pradesh High Court has given a sensational verdict on Mission Build AP. The High Court delivered its judgment on the recusal Petition where it has issued notices to mission build AP officer IAS Praveen Kumar who filed the false affidavit in the case.

మిషన్ బిల్డఫ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు హైకోర్టు అదేశం..

Posted: 12/30/2020 10:03 PM IST
Ap high court issues notices to mission build ap official directs registrar general to file case

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ సంచలన అదేశాలను వెలువరించింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులో సంబంధిత ఐఏఎస్ అధికారిపై ఏపీ రాష్ట్రోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. రెక్యూసల్ పిటీషన్ పై తీర్పును వెలువరిస్తూ.. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ సమర్పించిన మిషన్ బిల్డప్ ఏపీ బాధ్యతలను నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లో తప్పుడు సమాచారం ఎందుకు అందించారోనన్న వివరాలను కూడా తెలపాలని అదేశించింది.

కోర్టు ధిక్కారం కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రార్ జనరల్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేసింది. న్యాయవ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కల్పించుకోవడం మూలంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఈ కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పలు పిటీషన్లను న్యాయస్థానం కోట్టివేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఇక మరో కేసులో రాష్ట్ర ఉన్నత అధికారులకు కూడా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలో జరిగిన శాఖపరమైన పదోన్నత విషయంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ రామారావు దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో హోం కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీజీపి గౌతమ్ సవాంగ్, ఐజీ మహేశ్ చంద్ర లడ్డాలను వ్యక్తిగతంగా న్యాయస్థానంలో విచారణకు హాజరుకావాలని అదేశాలను వెలువరించింది. ఈ జనవరి 25కు ఈ కేసును వాయిదా వేసిన న్యాయస్థానం అదే రోజు హోం శాఖకు చెందిన ముగ్గురు ఉన్నాత అధికారులను న్యాయస్థానంలో హాజరుకావాలని అదేశిస్తూ నోటీసులను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles