Bharat Bandh: Highway blockades, slogans కొనసాగుతున్న 'భారత్ బంద్'.. రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజ..

Bharat bandh key roads blocked cm kejriwal under house arrest

Bharat Bandh, farmers Bharat Bandh, Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, Trianmool congress, BSP, SP, TRS, 14 Political parties, Trade Unions, Transport, Banking services

Police in several states tightened security on Tuesday as protests and highway blockades in several states began amid the call for the Bharat Bandh or nationwide shutdown by farmers protesting the three central farm laws. Transport services, offices and shops are likely to be affected in some states and cities during the Bharat Bandh.

కొనసాగుతున్న ‘భారత్ బంద్’.. రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజ..

Posted: 12/08/2020 01:12 PM IST
Bharat bandh key roads blocked cm kejriwal under house arrest

(Image source from: Financialexpress.com)

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలకు వ్యవసాయ రంగాన్ని అప్పగించేలా వుందని.. ఇది తమ స్వేఛ్చకు విఘాతం కలిగిస్తూ కార్పోరేట్లకు అధిపత్యం వహించేలా వుందని నిరసిస్తూ రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు దేశంలోని ఏకంగా 24 రాజకీయ పార్టీలు, పలు బ్యాంకు యూనియన్లు, కార్మిక సంఘాలు కూడా మద్దతునివ్వడంతో దేశవ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బంద్ కారణంగా రైతులు రోడ్డెక్కి కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.

బంద్ కారణంగా ప్రజా జీవితం ఎక్కడికక్కడ స్థంభించింపోయింది. పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ ను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరిమితం చేస్తుండగా, పలు రాష్ట్రాల్లో మాత్రం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తున్నారు. రైతు సంఘాలు కూడా నాలుగు గంటల భారత్ బంద్ కే పిలుపునిచ్చాయి, అయితే బంద్ కారణంగా దేశంలోని అన్ని జాతీయ రహదారులపైకి రైతులు, రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు కదిలివచ్చాయి, దీంతో ఎక్కడిక్కడ రహదారుల దిగ్భంధనం కొనసాగుతోంది. ఇక రహదారుల దిగ్భంధనంతో వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, బ్ాయంకులు, దుకాణాలు, బడ్డీ దుకాణాలు, చిరువ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. 

మహారాష్ట్రంలోని బుల్దానాలో భారత్ బంద్ లో భాగంగా నిరసన తెలుపుతున్న రైతులు రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సంఘాలకు మద్దతుగా బుల్దానా లోని స్వాభిమాని షెట్కారీ సంఘటన సభ్యులు చెన్నై- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలును మల్కాపుర్ రైల్వేస్టేషన్ వద్ద నిలువరించారు, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, ఈ క్రమంలో రగంలోకి దిగిన రైల్వే, మహారాష్ట్ర పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు, వీరితో పాటు సంఘటన నేత రవికాంత్ తుప్ కర్ ను అదుపులోకి  స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు, రైతు సంఘాల పిలుకు కదిలిన మహారాష్ట్ర రైతులు నవి ముంబై, నాసిక్, ధూలే, పూణే, షోలాపూర్ లలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా స్వచ్ఛంగా బంద్ చేశారు. 

సామాజిక కార్యకర్త అన్నా హజారే రైతులకు మద్దతుగా ఒక్కరోజు పాటు నిరాహార దీక్షను చేపట్టారు, తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్దిలో ఆయన ఈ దీక్షను చేపట్టారు, ఈ బంద్ ను దేశవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. తద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రైతుల హక్కులను కాలరాసే బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అటు మధ్యప్రదేశ్ లోనూ హోషన్గాబాద్ జిల్లాలో భారత్ బంద్ పిలుపులో భాగంగా రైతు సంఘాలు సియోనీ-మాల్వా జాతీయ రహదారి దిగ్భంధనం చేశారు. అటు దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు గృహనిర్భంధంలో ఉంచాయి. ఆయన రైతు సంఘాలను కలిస్తే వారిని రెచ్చగోట్టే అవకాశం వుందన్న నేపథ్యంలో పోలీసు బలగాలు ముందస్తు చర్యలకు ఉప్రక్రమించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles