Whisky is mixed with water and sold like new మద్యాన్ని కల్తీ చేసే విధంబెట్టిదనినా.. వైరల్ వీడియో.!

Liquor emptied from full bottles filled with water by blowing lids

illicit liquor, liquor mixed with water, full bottles caps removed, untampering liquor bottle seals, excise officials, ghatkesar, rangareddy, sai, rambabu, arrest, charminar excise police, hyderabad, Telangana, Crime

A WhatsApp video that went viral and finally landed in the hands of Excise officials, has blown the lid off a gang that was opening sealed whisky bottles

ITEMVIDEOS: మద్యాన్ని కల్తీ చేసే విధంబెట్టిదనినా.. వైరల్ వీడియో.!

Posted: 11/05/2020 07:21 PM IST
Liquor emptied from full bottles filled with water by blowing lids

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా, అంటూ శ్రీశ్రీ ఏనాడో చెప్పిన విషయాలు అప్పటి నుంచి సాక్ష్యాత్కరిస్తున్నా.. ఈ మధ్యకాలంలో మొత్తంగా దగాకోరులే రాజ్యాలు ఏలుతున్నాయి. అందుగలదు ఇందు లేదన్న విధముగా ఎందెందు వెతికినా కల్తీయే కలదు అన్న నానుడిని మర్చేసి మరీ కల్తీకి తెరలేపుతున్నారు. కల్తీలను కనిపెట్టాల్సిన అధికార యంత్రాంగం కూడా మామూళ్ల మత్తులో జోగుతుండడంతో తినే అన్నం, తాగే నీరు వరకు అన్ని కల్తీమయంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అవిర్భవం సమయానికి.. నేటికి చాలా మేరకు పెరిగిన మధ్యం సీసా ధరలోనూ కల్తీ పేట్రేగిపోతోంది.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతొంది. వారిపై అధికారులు చర్యలు తీసుకున్నా ఇలాంటి పనులే ఎందరో కల్తీరాయుళ్లు పాల్పడి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇక వీరిని ఈ విధమైన చర్యలకు మద్యం దుకాణాల లైసెన్సు పోందిన కాంట్రాక్టర్లు కూడా ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి, ఇక తాజాగా వాట్సాప్ లో విపరీతంగా చక్కర్లు కోడుతున్న వీడియోతో మద్యం మత్తును వీడిన ఎక్సైజ్ అధికారులు కల్తీరాయుళ్ల కల్తీవిధానం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

మద్యం సీసాను సీల్ తీయకుండా మూతను తీయండ, ఆపై దానిలోంచి మద్యాన్ని వాటర్ బాటిల్ లోకి మార్చడం, ఇక నీటితో మద్యం సీసాను భర్తీ చేయడం.. మళ్లీ యధావిధంగా సీల్ మూతను పకడ్బంధీగా ఫిక్స్ చేయడం అంతా చకచకా జరిగిపోయింది. అదీనూ ఒకటి కాదు రెండు కాదు ఓ లీటరు వాటర్ బాటిల్ పూర్తిగా మద్యంతో నిండే వరకు ఈ తంతు సాగింది. ఈ తంతును వీడియో తీస్తున్న విషయం తెలిసినా.. ఏ మాత్రం కంగారుపడని కల్తీరాయుళ్లు తాము పెద్ద ఘనకార్యం సాధిస్తున్నట్లుగా ఫోజుకొడుతూ కల్తీ మద్యం ఎలా చేస్తోరో చూపడం గమనార్హం.

చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ విభాగం ఈ వీడియోపై ఓ కేసును రిజిస్టర్ చేసి, విచారణను ప్రారంభించింది. విచారణ జరిపిన అధికారులు, వీరిలో ఒకర్ని ఘట్ కేసర్ కు చెందిన రెడ్డిపోయిన సాయి, మరొకర్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన రాంబాబుగా గుర్తించామని తెలిపారు. ఈ ట్రక్ కూడా రెడ్డిదేనని, అతనే డ్రైవర్ గా వచ్చాడని, బాటిల్స్ లో మద్యాన్ని కల్తీ చేస్తుంటే రాంబాబు సహకరించాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. వీడియో వైరల్ కావడంతో చర్యలు తీసుకోవడం విషయాన్ని అటుంచితే.. రాష్ట్రానికి మెండుగా అధాయాన్ని ఇస్తున్న మందుబాబులకైనా కనీసం ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు నాణ్యమైన సరుకును అందించాలి. కల్తీ ఎలా చేస్తున్నారో ఈ వీడియోలో చూడండీ..

(Video Source: Telangana Today)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh