Durga Matha as Sri MahaLakshmi Devi at Indrakeeladri ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ..

Durga devi atop indrakeeladri attired as sri mahalakshmi devi on seventh day of dasara celebrations

Kanaka durgadevi Temple, dasara celebrations, Sri Sri MahaLakshmi Devi, Saraswati Devi, Gayatri Devi. durga devi, Dasara celebrations at Durga temple , Indrakeeladri, Dasara celebrations, 9 days Dasara celebrations, dasara navaratri, COVID-19, Coronavirus, Indrakeeladri, Vijayawada, Andhra Pradesh, Alampur, jogulamba Temple, Shaktipeetam, Mahaboobnagar, Telangana

The nine-day Dasara celebrations have begun at the Durga temple on Indrakeelthe hillock, on the seventh day of Navaratri celebrations today the Goddess Kanaka Durga attired as Sri Sri MahaLakshmi Devi.

ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ..

Posted: 10/23/2020 05:03 PM IST
Durga devi atop indrakeeladri attired as sri mahalakshmi devi on seventh day of dasara celebrations

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో ఆరవ రోజైన ఇవాళ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. ఆశ్వీయుజ శుద్ధ సప్తమి నాడు కనకదుర్గమ్మ మహాలక్ష్మీ అలంకరణలో దర్శనమిస్తుండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారిని శ్రీమహాలక్ష్మీ రూపంలో దర్శించినంతనే తమ దారిద్య్రం, దుఃఖం, కష్టం, నష్టం హరించుకుపోయి ధనం, ధాన్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంపద, విజయం, కార్యసిద్ది కలుగుతుందని భక్తుల విశ్వాసం.

దేవి నవరాత్రుల్లో భాగంగా సప్తమియుక్త పర్వదినాన కనకదుర్గా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. దుర్గామాత కాళరాత్రి స్వరూపాన్ని దాల్చి నలువువర్ణంతో.. ఎగసిపడుతున్న కురులతో మెరుపు తీగను హారంగా ధరించి భయానకంగా ప్రజ్వరిల్లుతుంది. ఖరమును వాహనంగా చేసుకుని త్రినయనాలతో చతుర్భజములతో వుండే అమ్మవారు.. ఇంద్రకీలాద్రిలో శ్రీ మహాలక్ష్మి అవతారంలో రెండు చేతుల్లో కమలాలను, మరో రెండు చేతుల్లో అభయ వరధ హస్త ముద్రలను చూపిస్తూ.. ఇరువైపులా గజరాజుల సపర్యల మధ్య.. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో తేజోమయంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది.

శ్రీ మహాలక్ష్మి దేవి సర్వమంగళ స్వరూపిణి, ఐశ్వర్య ప్రదాయినిగా శుభంకరిగా భక్తులకు కొలుస్తారు. లక్ష్మీ స్వరూపం కావున ఈ దేవిని పూజిస్తే సర్వమంగళములు కలుగుతాయని భక్తులు విశ్వాసం. శ్రీ మహాలక్ష్మి దేవి.. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తోంది. కొలచిన వారికి కోంగుబంగారమై తోడుంటుంది. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వేకువ జాము నుంచే బారులు తీరారు. అయితే ఆలయ అధికారులు మాత్రం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. గంటలకు వెయ్యి మంది చోప్పున మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అమల్లో వున్న కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles