Bihar Polling in 3 phases; results on Nov 10 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మ్రోగిన నగరా..!

Bihar to vote on october 28 november 3 7 results on november 10

Bihar election dates, bihar election schedule, bihar election dates announced, bihar elections 2020 dates, Bihar Assembly Elections 2020, Bihar, Nitish Kumar, Election Commission, Tejashwi Yadav, Janata Dal (United), Rashtriya Janata Dal, Bharatiya Janata Party, Congress, JD(U), RJD, BJP, Bihar politics

The Election Commission of India on Friday announced the dates for the highly-anticipated Bihar Assembly elections, which will be conducted in three phases in October and November. The results will be announced on November 10.

కరోనా నిబంధనల మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మ్రోగిన నగరా..!

Posted: 09/26/2020 09:11 AM IST
Bihar to vote on october 28 november 3 7 results on november 10

కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మ్రోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. మొత్తంగా 243 శాసనసభ స్థానాలు వున్న బీహార్ అసెంబ్లీకి మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థులతో పాటు ఓటర్లు కూడా కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఎన్నికల కమీషన్ అదేశాలు జారి చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా వివరాలు తెలిపారు.

ఒక్కో పోలింగ్‌ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లను అనుమతిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని అన్నారు. బీహార్ లో మొత్తం 243 శాసనసభ స్థానాలకు శాసనసభ్యులను 7.29 కోట్ల మంది ఓటర్లు ఎంచుకోనున్నారని తెలిపారు, కరోనా నిబంధనల మేరకు బీహార్ లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందేనని తెలిపారు. బీహార్ లో పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. అక్కడ భౌతిక దూరం నిబంధనను పాటించడం తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు.

పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తామని తెలిపారు. వృద్ధులు, కరోనా రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోస్టల్‌ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ సమయాన్ని గంట సేపు పెంచుతున్నామని తెలిపారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అయితే, కరోనా  భౌతిక దూరం వంటి నిబంధనల దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సారి పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. అందులో 38 సీట్లు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వు సీట్లు ఉన్నాయని చెప్పారు. మూడు విడతల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. తొలి దశలో 71 నియోజక వర్గాల్లో, రెండో దశలో 94 స్థానాల్లో, మూడో దశలో 78 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అక్టోబరు 28న తొలి విడత పోలింగ్, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ పోలింగ్ ఉంటుందని వివరించారు. నవంబరు 10 ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles