Bhiwandi building collapse: Death toll rises to 39 మూడంతస్థుల భవనం కుప్పకూలి 10 మంది మృతి

Death toll rose to 39 in bhiwandi building collapse near mumbai

building collapsed in Patel Compound area, building collapsed in Bhiwandi, building collapsed in Thane municipality, building collapsed in mumbai, building collapsed in Maharashtra, three storey building collapsed in Bhiwandi, 3 storey building collapse in Mumbai, Patel Compound area, Bhiwandi, three storey building, building collapse, Mumbai, Maharashtra, crime

The death toll in the Bhiwandi building collapse in Maharashtra rose to 39 on Wednesday, with the recovery of eight more bodies overnight, police said. The dead include 15 children in the age group of two to 15, including three toddlers. Twenty five persons have been pulled out of the debris alive so far, police said.

ముంబై విషాదఘటన: 39కు చేరిన భీవండీ మృతుల సంఖ్య

Posted: 09/23/2020 05:32 PM IST
Death toll rose to 39 in bhiwandi building collapse near mumbai

(Image source from: Twitter.com/ANI)

ముంబై నగరం చేరువలోని భీవండీ ప్రాంతంలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం కుప్పకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయం 33గా నమోదైన మృతుల సంఖ్య మధ్యాహ్నానికి ఏకంగా 39కి చేరింది. ఈ నెల 21న వేకువ జామున 3.40 నిమిషాలకు చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో శిధిలాల కింద చిక్కకున్న దాదాపు 25 మందిని ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ సహా అదే రోజున స్థానికులు కూడా పెద్ద సంఖ్యతో రంగంలోకి దిగి కాపాడారు. అయితే ఈ భవనం శిధిలాలు తొలగిస్తున్న కోద్ది మరణాల సంఖ్య పెరుగుతుండంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

ఘటన జరిగిన క్రమంలో పది మంది మాత్రమే మరణించగా, ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. శిధిలాల కింద చిక్కకున్న చిన్నారులు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. దీంతో ఈ దుర్ఘటనలో మొత్తంగా ఇప్పటి వరకు 39 మృతదేహాలను వెలికితీశారు. మంగళవారం అర్ధరాత్రి శిథిలాల కింది నుంచి మృతదేహాలను వెలికితీయగా, ఇవాళ ఉదయం కూడా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది పదిహేనేళ్ల లోపు పిల్లలే ఉన్నారని అధికారులు తెలిపారు. తాజాగా వెలికి తీసిన మృతదేహాలలో పదిహేను మంది పదిహేనేళ్ల లోపు వయస్సుగల చిన్నారులేనని అధికారులు తెలిపారు. ఇక మూడు రెండేళ్ల లోపు శిశువుల మృతదేహాలు కూడా బయటపడ్డాయి.

ముంబై సమీపంలోని థానే మున్సిపాలిటీ పరిధిలో గల భీవండీ ప్రాంతంలోని పటేల్ కాంపౌండ్ ఏరియాలో ఈ ఘటన జరిగడంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బలగాలు 40 మంది ఎమర్జెన్సీ వర్కర్లతో పాటు 30 మంది రెస్క్యూ టీమ్ తో ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గత 36 గంటలుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సొమవారం ఉదయం నుంచి కొనసాగిస్తున్న వారి సహాయక చర్యలతో ఇప్పటి వరకు దాదాపు 30 మందిని సురక్షితంగా వెలికితీశారు. మరో 10 మంది శిథిలాల కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ మూడంస్థుల భవనంలో 20 కుటుంబాలు నివాసం వుంటున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ఇరవై కుటుంబాలకు చెందిన వారు మృతుల్లో వుండటం.. మిగిలిన వారు క్షతగాత్రులుగా ఆసుపత్రులలో చికిత్స పోందుతుండటం, ఇక చికిత్స పోందుతున్నవారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రి ఆవరణ కూడా బాధిత బంధువుల ఆర్థనాథాలతో శోకసంధ్రంగా మారింది. బాధిత కుటుంబాలను స్థానిక రాజకీయ నేతలు పరామార్శిస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్న మరో భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. అది కూడా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. దాదాపు 40 కుటుంబాలు అందులో నివాసముంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patel Compound area  Bhiwandi  three storey building  building collapse  Mumbai  Maharashtra  crime  

Other Articles