HRC issues notices to DEO to enquire and submit a report శివబాలజీ పిర్యాదుపై డీఈవోకు హెచ్ఆర్సీ నోటీసులు

Hrc issues notices to deo to enquire and submit a report based on actor siva balaji

Shiva Balaji, Swapna Madhuri, Private School, School Fee hike, Online Classes, Human Rights Commission, Mount Litera Zee school, Manikonda, Tollywood, Telangana

Human Rights Commission issues notices to DEO asks him to enquire and submit a report within two weeks based on Actor-Bigg Boss Telugu season 1 winner Siva Balaji and wife Swapna Madhuri complaint against Mount Litera Zee school, Manikonda, Hyderabad.

శివబాలజీ పిర్యాదుపై డీఈవోకు హెచ్ఆర్సీ నోటీసులు

Posted: 09/17/2020 03:03 AM IST
Hrc issues notices to deo to enquire and submit a report based on actor siva balaji

మహమ్మారి క‌రోనా విజృంభన కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థల తరగతులు ఈ ఏడాది ఎలాంటి ఫీజల పెంపుకు పాల్పడకూడదని, అలాగే ఎలాంటి డోనేషన్స్ తీసుకోకూడదని, పీజలు కూడా నెలవారీగా మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం అదేశించింది. ఈ ఫీజుల వ్యవహారంపై స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా ముఖంగా పాఠశాలల యాజమాన్యాలకు అదేశాలు ఇచ్చారు. అయితే స్వయంగా సీఎం అదేశాలు జారీ చేసినా ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాల యాజమాన్యాలు మాత్రం తమ దారి తమదేనని, తమకు ఎవరి అదేశాలు వర్తించవని ఏకంగా చేతలతోనే ప్రకటిస్తున్నాయన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినీ నటుడు శివ బాలజీకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్(హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో మానవ హక్కుల కమీషన్ జిల్లా విద్యాశాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. నటుడు శివబాలాజీ పిర్యాదు మేరకు మణికోండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ పాఠశాల యాజమాన్యంపై తగు విచారణ చేసి తమకు నివేదిక అందజేయాలని అదేశించింది. పాఠశాలపై సమగ్ర విచారణ చేసిన రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని అదేశించింది. దీంతో మౌంట్ లిటేరా జీ స్కూలు ఫీజలు పెంచిందా.? అన్న విషయం కూడా వెలుగులోకి రానుంది. దీంతో పాఠశాలపై ప్రభుత్వం కూడా తమ అదేశాలను లక్షపెట్టని కారణంగా చర్యలు తీసుకునే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

ఇక హెచ్ఆర్సీలో పిర్యాదు సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ ‘మౌంట్ లిటేరా జీ స్కూల్’ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా అధిక మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్లు చేస్తున్నారని అరోపించారు. అనుమానం రాకుండా ఉండేందుకు అన‌వ‌స‌రంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎందుక‌ని ప్ర‌శ్నించినందుకు తన పిల్ల‌లు ఆన్ లైన్ క్లాసులు వినకుండా ఐడీల‌ను బ్లాక్ చేసింది. దీనిపై యాజ‌మాన్యాన్ని హెచ్చరిస్తే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌ు. దీంతో తన పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా ఆయన హెచ్ఆర్సీలో లో ఫిర్యాదు చేశానన్నారు. ఆ స్కూలు యాజమాన్యం బలవంతంగా ఫీజులను వసూలు చేస్తోందని, ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles