RT-PCR to catch false negatives after rapid antigen test వారికి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలి: కేంద్రం

Retest all symptomatic cases who were negative in rapid antigen tests centre

rapid antigen test, RT-PCR, coronavirus, symptomatic negative cases, central government, Union Health Ministry, ICMR, Indian states, districts, coronavirus news, covid 19, india covid 19 cases, corona news, coronavirus cases in india, coronavirus india update, coronavirus cases today update

Symptomatic negative cases are those where the patient has symptoms of Covid, but tests negative. Since rapid antigen tests are known to have high degre of false negatives, the ICMR had mandated that symptomatic negative cases must get a retest through RT-PCR.

వారికి మళ్లీ కరోనా పరీక్షలు తప్పక నిర్వహించాలి: కేంద్రం తాజా అదేశాలు

Posted: 09/12/2020 12:17 PM IST
Retest all symptomatic cases who were negative in rapid antigen tests centre

కరోనా కేసుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు కరోనా వ్యాప్తి విజృంబిస్తున్నా.. మరో వైపు అన్ లాక్ ప్రక్రియను చేపడుతున్న కేంద్రం.. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు మాత్రమే ఇస్తూ.. వారిని కరోనా మహమ్మారి నుంచి తప్పించుకుని జాగ్రత్తగా వుండాలని చెబుతోంది. కరోనా మహమ్మారిని తక్కువగా అంచనా వేయరాదని అంటూనే విద్యార్థులకు పరీక్షలను నిర్వహించి.. వారిని బయటకు రప్పిస్తోంది. ఈ విషయాన్ని పక్కనబెడితే కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల విషయంలో పలు సూచనలు చేసింది.

కరోనా లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షల్లో వారికి కరోనా సోకలేదని ఫలితం వచ్చిన రోగులందరినీ మరోమారు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు చేయించుకుని, నెగటివ్ వచ్చినప్పటికీ, కరోనా లక్షణాలున్న అందరినీ మరోసారి పరీక్షించాలని, అందుకు విధిగా ఆర్టీ-పీసీఆర్ విధానాన్ని పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్యఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాలు తక్కువ ఖర్చుతో కూడకుని.. వేగంగా ఫలితాలను వెలువరించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను ప్రోత్సహించాయని, అయితే వీటితో తప్పుడు నివేదిక వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా వున్నాయని కేంద్రం పేర్కోంది.

దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వారిని వదిలేశారని, కానీ వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కోంది. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకున్న వారందరికీ నిబంధనల ప్రకారం ఆర్టీ-పీసీఆర్ చేయలేదని తెలుస్తోందని కేంద్రం పేర్కొంది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం, జ్వరం లేదా దగ్గు లేదా ఊపిరి ఇబ్బంది లక్షణాల్లో ఏదైనా ఉండి యాంటీజన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చినా, రెండు నుంచి మూడు రోజుల్లోనే మరలా పునఃపరీక్షలు చేయాలని కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. లక్షణాలుండి నెగటివ్ వచ్చిన వారు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో నూరు శాతం కచ్చితత్వం ఉండదని గుర్తు చేసింది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే, వైరస్ సోకినట్టేనని, నెగటివ్ వస్తే ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles