TTD bumper offer to Srivari Kalyanam devotees తిరుమల శ్రీవారి కళ్యాణం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..

Ttd announces bumper offer to srivari kalyanostavam digital devotees

Srivari Kalyanostavam, TTD, kalyanam devotees, supatham, free darshan, digital kalyan seva, Tirumala Tirupati Temple, YV Subba reddy, TTD Board Chairman, Tirupati, TTD News, Tirupati News, Tirupati latest news, Andhra Pradesh, devotional

TTD announces bumper offer to Srivari Kalyanostavam digital devotees, who perform kalyanam through online, which seva came since 7th September. The TTD offers the kalyanam devottees a free darshan through supatham entry within 90 days from the kalyanam date.

తిరుమల శ్రీవారి కళ్యాణం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..

Posted: 09/10/2020 02:24 PM IST
Ttd announces bumper offer to srivari kalyanostavam digital devotees

కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులను కూడా ఈ సేవలకు పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాలు భక్తుల పాలిట బంపర్ ఆపర్ గా మారుతున్నాయి, ఇప్పటికే అధిక ఆశ్వయుజ మాసం నేపథ్యంలో రెండు నెలల్లో రెండు పర్యాయాలు శ్రీవారి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి బోర్డు.. ఆర్జిత సేవలను నిర్వహించే భక్తులకు మరీ ముఖ్యంగా కళ్యాణసేవ చేసే భక్తులకు చక్కటి అవకాశాన్ని కల్పించనుంది.

సాధారణంగా తిరుమల శ్రీవారి కళ్యాణసేవ చేసే భక్తులకు కల్యాణం పూర్తైన తరువాత స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తారు. అయితే ఆన్ లైన్ లో కళ్యాణం చేసే భక్తులకు ఈ సేవతో పాటు దర్శనాన్ని కూడా కల్పించాలని భక్తుల వినతి మేరకు టీటీడీ ఈ వెసలుబాటును కల్పించింది. ఆన్ లైన్ లో శ్రీవారి కల్యాణం చేసిన భక్తులకు ఆ తరువాత మూడు నెలల వ్యవధిలో వారు కోరుకున్న రోజున సుపథం ద్వారా వారికి శ్రీవారి శ్రీఘ దర్శనాన్ని కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇక డిజిటల్ కళ్యాణం చేసిన భక్తులకు ఆ తరువాత రానున్న 90 రోజుల వ్యవధిలో దర్శనం లభించినట్లు అవుతోంది.

ఇక టీటీడీ డిజిటల్ మాద్యమంగా కల్పించిన కల్యాణోత్సవం సేవను ఈ నెల 7 నుంచి టీటీడీ ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. గత మూడు రోజుల్లోనే మొత్తంగా 8,330 మంది భక్తులు ఆన్ లైన్ ద్వారా కల్యాణోత్సవ సేవను నిర్వహించారని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి. కల్యాణోత్సవ సేవను చేసినవారందరికీ ఉత్తరీయం, రవిక, కల్యాణం అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా టీటీడీ పంపుతోంది. ఇకపై కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles