'Will Respectfully Pay Re 1 Fine': Prashant Bhushan భారత న్యాయవ్యవస్థపై గౌరవంతో జరిమానా కట్టాను: ప్రశాంత్ భూషణ్

Will respectfully pay re 1 fine prashant bhushan after top court order

Prashant Bhushan, Contempt case against Prashant Bhushan, Prashant Bhushan Case, Supreme Court, prashant bhushan case news, supreme court news, supreme court on prashant bhushan case, rajiv dhawan, CJI, SA Bobde

Prashant Bhushan, photographed holding up a Re 1 coin, announced at a press conference: 'I propose to submit to the order and respectfully pay the fine.' He said he had always believed the Supreme Court is the 'last bastion of hope for the weak and oppressed' and that he never intended to hurt the judiciary, but wanted to express his anguish on a 'deviation from its record'.

భారత న్యాయవ్యవస్థపై గౌరవంతో జరిమానా కట్టాను: ప్రశాంత్ భూషణ్

Posted: 09/01/2020 12:07 PM IST
Will respectfully pay re 1 fine prashant bhushan after top court order

(Image source from: Twitter.com/pbhushan1)

ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక్క రూపాయిని జరిమానాగా విధించిన నేపథ్యంలో్ ఆయన దానిని చెల్లించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన ఆనంతరం ఆయన ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలిపారు. భారత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులపై ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించిన ఆయన, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ప్రకారం, తాను ఒక్క రూపాయిని కోర్టుకు జమ చేస్తానని అన్నారు. ఇదే సమయంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను రివ్యూ పిటిషన్ ను కూడా దాఖలు చేస్తానని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.

తాను రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసే హక్కును కలిగివున్నానని అన్న ప్రశాంత్ భూషణ్.. దానిని కూడా దాఖలు చేస్తానన్నారు. అయితే, అంతకన్నా ముందే కోర్టు ఆదేశించినట్టుగా జరిమానా కడతానని అన్నారు. ఈ మేరకు ఆయన తన అధికార సామాజిక మాద్యమ అకౌంట్లో ట్విట్ చేశారు. కాగా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు సరిగా లేవంటూ భూషణ్ చేసిన వివాదాస్పద ట్వీట్లపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం తొలుత ఆయన తన మనసు మార్చుకునేందుకు అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, అందుకో హద్దు ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

అయితే, తన అభిప్రాయాలను మార్చుకునేది లేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని కోర్టు ముందు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేయడంతో, కోర్టు ధిక్కరణ నేరంగా దీన్ని పరిగణనలోకి తీసుకుని, ఒక రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రాక్టీస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసి, ఆయనను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిక్ష విధింపుపై కూడా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆయనకు ఈ రోజు ఒక్క రూపాయిని జరిమానాగా కట్టాలని శిక్షను విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prashant bhushan  supreme court  rajiv dhawan  CJI  SA Bobde  Contempt case  

Other Articles