CCMB, IICT says corona infected 6.6 lakh people నగరంలో 6 లక్షల మందికి కరోనా: తాజా అధ్యయనం

Testing of sewage samples reveals hyderabad may have 2 6 lakh active covid 19 cases

coronavirus, coronavirus cases in Hyderabad, Hyderabad COVID-19 cases, sewage treatment plants, CCMB, IICT, coronavirus cases in Telangana, coronavirus count in hyderabad, coronavirus update, coronavirus cases, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Around 6.6 lakh people in Hyderabad (around 6.6 percent of the total population) may have been infected with COVID-19 in just the last 35 days and at present, the city might be home to about 2.6 lakh active cases -- and these are just conservative estimates.

హైదరాబాద్ లో ఆరు లక్షల మంది కరోనా బాధితులు: తాజా అధ్యయనం

Posted: 08/20/2020 07:56 PM IST
Testing of sewage samples reveals hyderabad may have 2 6 lakh active covid 19 cases

భాగ్యనగరంగా బాసిల్లిన హైదరాబాద్ పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. కరోనా నేపథ్యంలో బీరాలు పోయిన పాలకులు.. శాసనసభలో సవాల్ విసిరినా.. చివరాఖరున గణంకాల తారుమారు చేసినా.. నగరంపై మాత్రం కరోనా విజృంభన అనుకున్న దానికంటే అధికంగానే వుందన్నది కాదనలేని సత్యం. ఇక కరోనా నేపథ్యంలో తొలినాళ్లలో ప్రతీ పక్షం రోజులకో పర్యాయం ప్రజల ముందుకు వచ్చి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై విశ్లేషించిన పాలకులు.. ఆ తరువాత అసలు కనిపంచడం తగ్గించారు. దీంతో పాలకులు కనిపించడం లేదంటూ విపక్షాలతో పాటు సోషల్ మీడియా కూడా అనేక సెటైరికల్ పోస్టులు పెట్టింది.

ప్రభుత్వం చూపుతున్న గణంకాలను పరిగణలోకి తీసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో అది నుంచి ఇప్పటివరకు కేవలం వేల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. కానీ తాజాగా జరిపిన పరిశోధనల్లో ఏకంగా లక్షల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయని వెల్డైంది, కేవలం 35 రోజుల వ్యవదిలోనే ఈ మేరకు కేసులు నమోదయ్యాయని కూడా తెలుస్తోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మురుగునీటిలోని యాంటీబాడీలపై సంయుక్తంగా చేసిన పరిశోధనల ఫలితాలు వెల్లడికాగా, వాటి నుంచి ఈ మేరకు ఫలితాలు విశ్లేషించబడ్డాయి. 

నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి  ఇంచుమించు సమానంగా ఉందని వెల్లడైంది. లక్షణాలు లేకుండానే ఎక్కువమంది దీని బారిన పడి.. దాని నుంచి కోలుకున్నారని తాజా అధ్యయనంలో తేలింది. కరోనా సోకినవారి ముక్కు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్‌ బహిర్గతమవుతుంది. దీంతో వైరస్‌ వ్యాప్తి తీరును నిర్ధారించేందుకు మురుగునీటి పరీక్షల అంశంపై హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు పరిశోధన చేపట్టాయి.  నగరవ్యాప్తంగా నిత్యం 1800 మిలియన్‌ లీటర్ల మురుగు వస్తుండగా.. 760 మిలియన్‌ లీటర్లనే (40 శాతం) మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో(ఎస్టీపీల్లో) శుద్ధి చేస్తున్నారు. వీటిలో 80 శాతం కేంద్రాల వద్ద 35 నమూనాలను సేకరించి సీసీఎంబీలో పరిశీలించాగా ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles