Violence breaks out in Bengaluru, MLA's house attacked ఎమ్మెల్యే అల్లుడి పోస్టుతో అందోళనకారుల వీరంగం..

Miscreants torch mlas house vandalise police station over social media post

communal social media post, Akhanda Srinivasa murthy house torched, Pulakeshinagar MLA house torched, Bengaluru police station vandalised, Basavaraj Bommai, Pulikeshinagar Congress MLA, MLA Srinivas Murthy, nephew Naveen, KG Halli Police Station, pulikeshinagar, communal violence, social media, Congress MLA, Karnataka

Apparently irked by a social media post, a group of miscreants torched the house of a Congress MLA from Pulikeshinagar Akhanda Srinivas Mmurthy and also vandalised KG Halli police station. The group alleged that Akhanda Srinivas Murthy's nephew had posted derogatory comments against a minority community and demanded immediate action against him.

ఎమ్మెల్యే అల్లుడి పోస్టుతో అందోళనకారుల వీరంగం.. ఇంటిపై దాడి..

Posted: 08/12/2020 02:19 PM IST
Miscreants torch mlas house vandalise police station over social media post

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై ఓ వర్గానికి చెందిన అందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పోలిస్ స్టేషన్ పై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో కర్ణాటకలోని డి.జె.హళ్లి ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. అందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో సాగిన ఘర్షణల్లో ముగ్గురు అసువులుబాసారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ ఆందోళకారులు ఆగ్రహంతో శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు డి.జే.హళ్లి ఠాణాపై రాళ్ల దాడి చేశారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్‌ ఎదుట ఉన్న వాహనాలను తగులబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి సహా, భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ముగ్గురు నిరసన కారులు మృత్యువాత పడ్డారు. నిరసనకారులు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 147 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సీపీ వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే అల్లుడు నవీన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో డి.జె.హళ్లి, కె.జె.హళ్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీపీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles