Was Offended And Hurt By Name-Calling, Sachin Pilot గెహ్లెట్ వ్యాఖ్యలు నన్ను భాధించాయి: పైలట్

Was offended and hurt by name calling sachin pilot

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Congress's Sachin Pilot, back in Rajasthan after ending his month-long revolt against Chief Minister Ashok Gehlot, said today that he had 'no hard feelings' and was no longer part of the state government but he expected the 'head of the family' to resolve disputes and take everyone along.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నన్ను భాధించాయి: మాజీ ఉపముఖ్యమంత్రి

Posted: 08/11/2020 11:52 PM IST
Was offended and hurt by name calling sachin pilot

(Image source from: Twitter.com/ANI)

రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్ అన్నారు. తన మాజీ బాస్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ తనను ఓ నేతగా గుర్తించకపోయినా.. చౌకబారు అరోపణలు, విమర్శలు చేశారని.. అవి ఆయనను బాధించాయని తెలిపారు. గెహ్లాట్ తనను పనికిరానివాడని దూషించినా, బీజేపితో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నానని ఆరోపించినా ఆయనను గౌరవిస్తానని సచిన్‌ తెలిపారు. ఇతరులతో సహా, తన బద్ధ శత్రువులను తాను ఎంత వ్యతిరేకించినా వారి పట్ల తాను అలాంటి మాటలు ఉపయోగించనని తెలిపారు.

అలాంటి విలువలను తాను తన కుటుంబం నుంచి పొందానన్నారు. తాను రాజకీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవన విధానంలో కానీ తన విలువలకు కట్టుబడే వుంటానని పైలట్ అన్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోట్ తనకంటే పెద్దవారు, వ్యక్తిగతంగా ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని అన్నారు. పని, పాలనాపరమైన వ్యవహారాలలో తన అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు ఉందని అన్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తనన్నెంతో బాధించాయన్నారు. కాగా, వాటిపై ఇప్పుడు తాను స్పందించాలనుకోవడం లేదని అన్నారు. మాట్లాడేటప్పుడు సరైన భాషను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఇతరుల గురించి బహిరంగంగా మనం వ్యాఖ్యలు చేసేప్పుడు దానికి భాషాపరమైన లక్ష్మణ రేఖ ఉంటుందన్నారు.

గత ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఆ లక్ష్మణ రేఖను తాను ఎప్పుడూ దాటలేదని అన్నారు. నెల రోజుల క్రితం అశోక్‌ గహ్లోట్ తో విభేదించి, మరో 18మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బావుటా ఎగురువేసిన పైలట్ తొలి నుంచి తాను బీజేపితో చేతులు కలపలేదని చెబుతూనే వస్తున్నారు. అయితే సోమవారం కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో సచిన్‌ పైలట్ భేటీ అయ్యారు. తన వర్గం డిమాండ్లను వారు ఎంతో ఓపిగ్గా విన్నారని, వాటిని పరిష్కరిస్తామని మాట ఇచ్చినట్లు సచిన్‌ వెల్లడించారు. దీంతో రాజస్థాన్‌లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు నిన్నటితో తెరపడిన సంగతి తెలిసిందే. తాను చివర వరకు పార్టీలోనే కొనసాగనున్నట్లు కాంగ్రెస్‌ అధిష్ఠానంతో జరిగిన చర్చల అనంతరం పైలట్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles