After pilot returns, Rajasthan Assembly session on August 14 సమసిన రాజస్థాన్ సంక్షోభం: శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు

After pilot returns to congress rajasthan assembly session on august 14

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Ahead of the Rajasthan Assembly session on August 14, there appears to be a subtle change in the political strategy of the Opposition BJP in the state ruled by the Congress' Ashok Gehlot government.

సమసిన రాజస్థాన్ సంక్షోభం: శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు

Posted: 08/11/2020 10:43 AM IST
After pilot returns to congress rajasthan assembly session on august 14

(Image source from: Twitter.com/RahulGandhi)

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితి పూర్తిగా సద్దుమణిగింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వానికి ఏర్పడిన రసకందాయ పరిస్థితి సమసిపోయింది. రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తన మద్దతుదారులతో కలసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంలో అంతా సంక్షోభ పూర్వస్థితికి చేరుకుంది. దీంతో రాజస్థాన్ లో మూడవ పర్యాయం అసెంబ్లీ సమావేశాలకు లభించని గవర్నర్ కాల్ రాజ్ మిశ్రా అనుమతి ఇక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలను లభించింది.

సోమవారం పార్టీ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలతో తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సమావేశమయ్యారు. దీంతో మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విశ్వాస పరీక్షను ఎదుర్కోనే పరిస్థితి తప్పిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రంగంలోకి దిగి పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీతో సచిన్‌ పైలట్‌ భేటీ అనంతరం.. కాంగ్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్‌ పార్టీ,  రాష్ట్రంలో ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేస్తారని అందులో పేర్కొంది.

ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మకమైన, స్పష్టతతో కూడిన చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘పైలట్, ఇతర ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారిస్తామని, ఇందుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని  ప్రకటనలో పేర్కోన్నారు. దీంతో దాదాపు నెల క్రితం 18 మంది ఎమ్మెల్యేలతో పైలట్‌ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేసి, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన విషయం, గహ్లోత్‌ సర్కారు మనుగడకు ముప్పుగా పరిణమించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles