Rain showers diamond in farmers life కర్నూలు జిల్లా వజ్రాల ఖిల్లా.. రైతన్నలకు పంట

Rain showers in kurnool brings diamond lights in farmers life

coronavirus, covid-19, Farmer Diamond, Farmer Diamond rain, Farmer Diamond local trader, Farmer cheated by local trader, Diamond, Farmer, Local Trader, Peravali, maddikera mandal, Madananthapuram, Tuggali mandal, Kurnool District, Andhra Pradesh, Crime

A farmer while going to agriculture lands of peravali village in maddikera mandal was known to have found a diamond. Which is of 2 carrats weight. The local diamond merchants has purchased it in auction conducted by the farmer.

కర్నూలు జిల్లా వజ్రాల ఖిల్లా.. రైతన్నలకు పంట

Posted: 07/24/2020 11:27 AM IST
Rain showers in kurnool brings diamond lights in farmers life

కర్నూలు జిల్లాకు రాజుల పాలనకు సంబంధించిన విషయాలు చరిత్రలోకి తొంగిచూస్తే తెలుస్తాయి కానీ.. జిల్లాకు వరుణుడికి.. భూమికి.. రత్నాలకు మాత్రం తప్పకుండా లింక్ ఏదో వుంది. తొలకరి జల్లులు పడిన నాటి నుంచి వర్షకాలంలో భారీ వర్షాలు పడే వరకు ఇక్కడ వజ్రాలు లభ్యమవుతాయన్నది కాదనలేని సత్యం. తాజాగా జిల్లాలోని మద్దికెర మండలంలో మరో వజ్రం లభించింది. ఈ నెల ప్రారంభంలో పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం లభించి అదృష్టం వరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఓ మహిళా రైతులకు కూడా వజ్రం లభించింది. ఇక తాజాగా ఓ రైతు కష్టాలను దూరం చేయడానికి వజ్రం దొరికింది. ఈ విషయం గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది.

మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన రైతుకు ఈ వజ్రం లభించింది. అయితే ఇది కేవలం రెండు క్యారెట్లు మాత్రమే వుంది. అయితే రైతు మాత్రం తన తెలిపితేటలతో వజ్రానికి అసలు విలువకే అమ్మగలిగాడు. తనకు దొరికిన ఈ వజ్రం బరువు 2 క్యారెట్లు మాత్రమే అని తెలుసుకున్న రైతు.. ఈ వజ్రాన్ని వ్యాపారులను పిలిచి వేలం వేశాడు. దీంతో ఈ వేలంలో పాల్గోన్న గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు వజ్రాన్ని లక్షన్నర రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు మద్దికెర మండలంలోని మదనాంతపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కూడా వజ్రాలు లభించాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

వ్యవసాయ కూలీ పనుల కోసం మద్దికెరకు చెందిన ముగ్గురు వ్యవసాయ కూలీలు తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డికి వెళ్తుండగా వారిలో ముగ్గురికి వజ్రాలు దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వజ్రాలు బయటపడడం సాధారణమైన విషయమే. చాలామంది ఈ కాలంలో వజ్రాల కోసం పొలాల్లో వేట మొదలుపెడతారు. అయితే ఈ ప్రాంతంలో ఈ సీజన్ లో వజ్రాలు దొరకడం చాలా కామన్ అని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలువురికి విలువైన వజ్రాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. ఆ ప్రాంతంలో తొలకరి జల్లులు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. రత్నాల పంటలే పండుతాయి.

చినుకు పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి. రాయలసీమ రాత్నాల సీమ అన్న నానుడికి నామసార్థకం చేసేలా కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో తొలకరికి వజ్రాలకు సంబంధాలు వున్నాయి. ఇక వర్షాకాలం వచ్చింది తొలకరి జల్లులు పడ్డాయి అంటే ఊళ్లకు ఊళ్లు జనం భూముల్లో అన్వేషణ సాగిస్తుంటారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. అయితే అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. వానాకాలం వచ్చిందంటే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి.

వజ్రాలను వెతకడానికి స్థానికులు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సైతం ఇక్కడికి వస్తుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 6 వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. కాగా, ఈ వజ్రాల వేట స్థానిక రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్న జనం డైమెండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కేస్తున్నారట. దీంతో పొలం దున్నేటప్పుడు తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. అయితే ఎన్ని వజ్రాలు లభించినా సామాన్యులకు లభించేది చిటికెడు లాభమే.. మిగతాదంగా మధ్యవర్తుల పరమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles