Mehtab Hossain quits politics within 24 hours of joining BJP బీజేపిలో చేరిన వెంటనే మెహతాబ్ హుస్సేన్ సంచలన నిర్ణయం

Ex footballer mehtab hossain takes u turn dissociates from bjp in 24 hrs

BJP, Bengal, Mehtab Hossaoin, Footballer, East Bengal, Mohun Bagan, TMC, Mehatab Hosiyaan, Football, BJP, dileep Ghosh, Resign. West Bengal, Politics

A day after joining the BJP, former Indian footballer Mehtab Hossain on Wednesday said he was not associated with any political party. Hossain, known as the 'Midfield General' in the Kolkata Maidan, said it was a personal decision to quit politics as he was left shattered by the pain and feelings of his family and well-wishers over his sudden move to join a political party.

బీజేపిలో చేరిన వెంటనే మెహతాబ్ హుస్సేన్ సంచలన నిర్ణయం

Posted: 07/23/2020 07:33 PM IST
Ex footballer mehtab hossain takes u turn dissociates from bjp in 24 hrs

కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన తరువాత 24 గంటలు తిరగకముందే భారత మాజీ ఫుట్ బాల్ స్టార్ మెహతాబ్ హోసియాన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేసుందుకు, వారికి దగ్గరయ్యేందుకే తాను రాజకీయాల్లో చేరుతున్నానని ప్రకటించిన ఆయన ఒక్క రోజు కూడా తిరిగితిరక్క ముందే.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. బీజేపి పార్టీకి, ఆ పార్టీ సభ్యత్వాన్ని వదిలివేశాడు. తాను రాజకీయాలనే పూర్తిగా వదిలేస్తున్నానంటూ ప్రకటించాడు. కోల్ కతా మైదాన్ లో 'మిడ్ ఫీల్డ్ జనరల్'గా గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెహతాబ్ కు రాజకీయం మహా డేంజర్ గేమ్ అని తెలుసుకునేందుకు పెద్దగా సమయం పట్టలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

తాను అడే గేమ్ లో ప్రత్యర్థులు ఏక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో కూడా తెలిసి వారిని ఎలా ఎదర్కోవాలన్న విషయం కూడా పక్కగా తెలిసిన మొహతాబ్ కు రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులు ఎక్కడ వుంటారో.. ఎలా వుంటారో.. స్వపక్షంలో వుంటారా.? లేక ప్రతిపక్షంలో వుంటారా..? అన్న విషయం తెలుసుకునేందుకు పెద్దగా సమయం పట్టలేదు అందుకనే తాను చేరిన పార్టీ నుంచి అంత త్వరగా వెనక్కి వచ్చేసి.. రాజకీయాలకు ఓ పెద్ద సలామ్ కోట్టేశాడు. తాను తీసుకున్న నిర్ణయం కేవలం వ్యక్తిగతమైనదేనని స్పష్టం చేశారు. ఇక ఈ వ్యక్తి గత నిర్ణయం తీసుకునేందుకు తనను అభిమానించే అభిమానులు అన్ని పార్టీలలోనూ వుండటం కూడా ఓ కారణంగా పేర్కోన్నాడు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ను కలిసి మంగళవారం తాను బీజేపీలో చేరుతున్నట్టు మెహతాబ్ ప్రకటించారు. మురళీధర్ సేన్ లేన్ కార్యాలయానికి వచ్చి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆయన, 'భారత్ మాతా కీ జై' అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, కాషాయ కండువా కప్పుకున్నారు. ఆపై ఒకరోజు కూడా గడవకముందే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగుతున్నట్టు ప్రకటించారు. "నేను నేటి నుంచి ఏ రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తిని కాను. నా చర్యలతో నా మేలు కోలేవారికి ఇబ్బంది కలిగించి వుంటే క్షంతవ్యుడను.  ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఒత్తిడీ లేదు. ఇకపై నేను రాజకీయాల్లో కొనసాగబోను" అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో మెహతాబ్ ప్రకటించారు.

అంతకుముందు రోజు మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు దగ్గరవ్వాలని భావిస్తున్నానని, అందుకే రాజకీయాలను ఎంచుకున్నానని అన్నారు. ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇంత అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రావాలని భావించానని తెలిపిన ఆయన, బీజేపీలో చేరిన తరువాత మాట మార్చారు. ప్రజలు తనను ఓ రాజకీయ నాయకుడిగా చూడాలని భావించడం లేదని, వారి మనోభావాలను తాను గౌరవిస్తానని అన్నారు. కాగా, భారత్ తరఫున 30 మ్యాచ్ లు ఆడిన మెహతాబ్, రెండు గోల్స్ చేశారు. 2018-19 సీజన్ లో మోహన్ బగాన్ క్లబ్ తరఫున ఆడిన తరువాత, ఆటకు గుడ్ బై చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mehatab Hosiyaan  Football  BJP  dileep Ghosh  Resign  West Bengal  Politics  

Other Articles