కరోనా మహమ్మారి నియంత్రణకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ పై ఎక్కువ మంది నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో ఆ ఆశలను నిజం చేస్తూ.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. తాము ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనికా టీకా కరోనా వైరస్‌తో సమర్థంగా పోరాడగలదని ప్రకటించింది. అంతేకాకుండా తమ టీకా చాలా సురక్షితమని వెల్లడించింది. అందరూ ఊహించినట్లే సోమవారం (జులై 20) కరోనా వ్యాక్సిన్ అధ్యయన ప్రాథమిక ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. తమ వ్యాక్సిన్ వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వివరించింది.
ఈ మేరకు మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మరిన్ని ఫలితాల కోసం చివరి దశగా వృద్ధులపై ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు ప్రయోగాల పూర్తి ఫలితాలు వస్తాయని ఆక్స్‌ఫర్డ్ పేర్కొంది. మానవులపై పరీక్షల అనంతరం తమ టీకా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలదని ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల బృందం చెప్పినట్లు యూకే మీడియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ ఎడిటర్ ముందే సంకేతం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వ్యాక్సిన్ రేసులో ముందున్న ఆక్స్‌ఫర్డ్ టీకా అధ్యయన ఫలితాలను ప్రకటించబోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో వైద్యరంగంతో పాటు సామాన్యుల్లోనూ ఆ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ‘రేపు.. వ్యాక్సిన్.. జస్ట్ సేయింగ్’ అంటూ లాన్సెట్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హార్టన్ ఆదివారం ట్వీట్ చేశారు. దీంతో జులై 20 నాటి సంచికలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్-I క్లినికల్ ట్రయల్స్ డేటాను ఆ జర్నల్ ప్రచురిస్తారని అందరూ భావించారు.
భారత్ కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆస్ట్రాజెనెకా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి ఒప్పందం చేసుకుంది. వచ్చే నెలలో దేశంలోనూ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని తెలిపింది. మరోవైపు.. కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 పైగా పరిశోధనలు చేస్తుండగా.. వీటిలో 20 పైగా పరిశోధనలు ముందు వరుసలో ఉన్నాయి. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ తొలి దశలోనూ విజయాన్ని అందుకుని ఆశలు రేపుతున్నాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రకటించింది.
వ్యాక్సిన్ పై ప్రయోగాలు విజయవంతం కావడంతో ఉత్పత్తికి సంబంధించిన చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించింది. ఇటు భారత్లోనూ కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవ్యాగ్జిన్ కూడా ఇవాళ నిమ్స్ తో పాటుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లోనూ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశను ప్రారంభించాయి. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లపై సోమవారం ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. అటు ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. నిమ్స్ లో వాక్సీన్ తీసుకున్న ఇద్దరు వాలెంటీర్లు సురక్షితంగా వున్నారని వైద్యవర్గాలు వెల్లడించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more