Congress suspends two MLAs for toppling conspiracy మరో ఇద్దరు కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మేల్యేల బహిష్కరణ

Congress suspends bhanwar lal sharma vishvendra singh over rajasthan political crisis

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Congress has suspended MLAs Bhanwar Lal Sharma and Vishvendra Singh from the primary membership of the party, a statement by the party said here on Friday. Show cause notices have been issued to them to 'explain their conduct in the conspiracy to topple Congress government in Rajasthan.'

మరో ఇద్దరు కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మేల్యేల బహిష్కరణ

Posted: 07/17/2020 02:24 PM IST
Congress suspends bhanwar lal sharma vishvendra singh over rajasthan political crisis

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రసకందాయంలో పడినా.. అసమ్మతి జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతూనే హుంకారాలు చేస్తోంది. తమకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనుకాడటం లేదు. రాజస్థాన్ ఉఫముఖ్యమంత్రి సచిన్ పైలైట్ తన వర్గం ఎమ్మెల్యేలకు చెందిన వీడియోను విడుదల చేసిన వెంటనే ఆయనను ఉపముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పదవుల నుంచి తప్పించిన కాంగ్రెస్.. ఆయనకు మద్దతుగా నిలిచిన ఇద్దరి మంత్రులకు కూడా ఉద్వాసన పలికిన తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై కూడా వేటు వేసింది

ఇద్దరు ఎమ్మెల్యేలపై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది. భన్వర్ లాల్‌ శర్మ, విశ్వేంద్రసింగ్‌ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్‌ రద్దు చేసింది. వారిద్దరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యుడిగా తనతో సహా 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ సీపీ జోషి ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ సచిన్‌ పైలట్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై రాజస్థాన్‌ హైకోర్టు విచారణ జరపనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు పైలట్‌ పిటిషన్‌పై విచారణ జరగనుండగా.. అనర్హత నోటీసులపై సమాధానం చెప్పాలని అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్‌ విధించిన గడువు కూడా అదే సమయానికి ముగియనుంది.

ఈ నేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోర్టు వరకు తీసుకెళ్లినా సచిన్‌ పైలట్‌కు మాత్రం కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ద్వారాలు తెరిచే ఉంచినట్లు సమాచారం. పైలట్‌పై తీవ్ర విమర్శలు చేయరాదని సీఎం అశోక్‌ గెహ్లోట్ కు సూచించినట్లు తెలిసింది. ఓ దక్షిణాదినేత పైలట్ తో సంప్రదింపులు జరపగా.. కాంగ్రెస్‌లో తన రాకకు షరతులు విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను మరిచపోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, పార్టీలో తగిన గౌరవం ఉంటుందని పైలట్‌కు ఆనేత చెప్పినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles