HC stays again on demolition of old Secretariat పాత సచివాలయం భవనం కూల్చివేత ఆపండి: హైకోర్టు

High court stays again on demolition of old telangana secretariat complex

telangana secretariat, secretariat hyderabad, secretariat telangana, hyderabad secretariat, telangana new secretariat, new secretariat telangana, outer ring road hyderabad, new secretariat, Telangana Secretariat new building, Secretariat new building design, Telangana Secretariat, TS new Secretariat building, Telangana new Secretariat building design

High Court stays again on demolition of old Telangana Secretariat complex, hearing the Public Interest Litigation petition, which was filed two days ago, against the demolition work of old secretariat building complex.

పాత సచివాలయం భవనం కూల్చివేతపై స్టే : హైకోర్టు

Posted: 07/13/2020 09:18 PM IST
High court stays again on demolition of old telangana secretariat complex

తెలంగాణకు కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 17న శంఖుస్థాపన చేసిన నాటి నుంచి అడ్డంకులు ఏర్పడుతునే వున్నాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్న ఈ తరుణంలో హైకోర్టు కూల్చివేతలను నిలిపివేయాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలంగాణ పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులను మరో రెండు రోజుల పాటు నిలిపివేయాలని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సోమవారం వరకు మాత్రమే నిలవాల్సిన కూల్చివేత పనులు మరోమారు బుధవారం వరకు పోడుగించింది.

దీనిపై గతంలో విచారణ ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇవాల్టి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. తిరిగి దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతపై జూన్‌ 30న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ హైకోర్టుకు వివరించారు. మంత్రివర్గ ప్రతిని సమర్పించకుంటే ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్ నోట్‌ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. మంత్రివర్గ నిర్ణయ ప్రతిని సాయంత్రం లోపు సమర్పిస్తామని కోర్టు ఏజీ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాన్ని షీల్డు కవరులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వకౌంటర్ పై అభ్యంతరాలుంటే రేపటిలోగా సమర్పించాలని పిటిషనర్లను కోరింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.

పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని హైకోర్టులో మరో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని  ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని వ‌ల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి,  ఆ ప్రాంతంలో దాదాపు ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలి కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా భవనాలను కూల్చివేస్తున్నారని చెప్పారు. ఈ పిటీషన్ పై ఇవాళ విచారించిన న్యాయస్థానం తొలుత సోమవారం వరకు ఆ తరువాత బుధవారం వరకు తాత్కలికంగా కూల్చివేత పనులు నిలిపివేయాలని అదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Revolutionary balladeer vangapandu prasada rao passes away

    జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

    Aug 04 | ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస... Read more

  • Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

    మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

    Aug 04 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే... Read more

  • Covid 19 update with 1286 new covid 19 cases telanganas tally surges near 69000 mark

    తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1286 కేసులు.. 12 మరణాలు

    Aug 04 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై తోమ్మిది వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా... Read more

  • Coronavirus cases in india records spike of over 50000 cases tally tops 18 5 lakh

    దేశంలో కరోనా ఉగ్రరూపం: 18 లక్షలు చేరిన కేసులు.. 39 వేలకు చేరిన మరణాలు

    Aug 04 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు... Read more

  • Kangana ranaut alleges gunshots fired near her residence in manali

    హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

    Aug 02 | బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె... Read more

Today on Telugu Wishesh