TTD on alert after 80 temple staff test positive తిరుమలలో తీవ్ర కలకలం.. అర్చక సిబ్బందిలో 80 మందికి కరోనా.!

Total 80 ttd priests and staff testing positive for coronavirus says district collector

Coronavirus in Tirumala, Coronavirus on seven hills Shrine, Coronavirus to TTD priests, coronavirus to TTD Employees, coronavirus TTD staff, TTD meet amid coronavirus, TTD priests, TTD staff, TTD Employees, coronavirus, covid-19, lockdown, chittor collector, Bharat Gupta, Tirumala, Turupati, Andhra pradesh

After the 2 and half months of continuous lockdown, the TTD officials have started allowing the devotees to Tirumala to visit Lord Balaji. It seemed everything is going smoothly. But all of a sudden 10 temple staff tested positive for Covid-19.

తిరుమలలో తీవ్ర కలకలం.. అర్చక సిబ్బందిలో 80 మందికి కరోనా.!

Posted: 07/09/2020 01:04 PM IST
Total 80 ttd priests and staff testing positive for coronavirus says district collector

(Image source from: Timesofindia.indiatimes.com)

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. అక్కడి, ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడకు చోచ్చుకెళ్తోంది. లాక్ డౌన్ విధింపుతో సుమారు 80 రోజుల పాటు భక్తుల తాకిడి లేకుండా వెలవెలబోయిన కలియుగ వైకుంఠంలో అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ తరుణంలో పవిత్ర కోండపై కరోనా కలకలం రేగింది. గత నెల నుంచి ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరుడి దివ్యదర్శనం నేపథ్యంలో ఏడుకోండలపై కరోనా కలవరం తీవ్ర అందోళనకు గురిచేసింది.గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు, దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు. టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 80 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. అయితే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు, రోజు 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక భక్తుల నుంచి ఆర్చక సిబ్బందికి, ఆలయ సిబ్బందికి కరోనా వైరస్ సోకిందా.? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆలా వ్యాపించిందని అనేందుకు ఆధారాలు లేవని అన్నారు. ఇప్పటి వరకు 800 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని అన్నారు.

టీటీడీ సిబ్బందికి కరోనా సోకడంపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఉద్యోగుల్లో పాలకమండలి మనోధైర్యం నింపుతోందన్నారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ బాధ్యతను ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డికు అప్పగించారు. ఇక తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తామన్నారు సుబ్బారెడ్డి.ఈ నెలాఖరు వరకు భక్తుల సంఖ్యను పెంచబోమన్నారు. ఇప్పటి వరకూ ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.

తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే తిరుపతిలో కోరానా సోకిన వ్యక్తులు కోండపైకి వచ్చిన నేపథ్యంలో ఈ వైరస్ సోకి వుంటుందని అనుమానాలకు కలెక్టర్ ప్రకటనతో చెక్ పడింది. అయితే భక్తులకు ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles