Telangana to conduct Degree, PG Exams డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు..

Telangana higher education depertment to conduct degree pg exams in august

Union Home Ministry, Telangana colleges, Telangana universities, degree and pg exams, coronavirus, degree and pg exams news, degree and pg exams latest, degree and pg exams new updates, degree and pg exams dates, degree and pg exams schedules, degree exams, post Graduate exams, final semister, coronavirus, covid-19

The Telangana Higher Education department to conduct Degree, PG, MBA, MCA, BPharma examinations following the guidelines issued by the Union government. The Home Ministry said that there is no scraping of the final year or final semester examinations at the colleges and universities.

డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు..

Posted: 07/08/2020 08:23 PM IST
Telangana higher education depertment to conduct degree pg exams in august

(Image source from: Telugu.samayam.com)

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్న వినతుల పరిగణలోకి తీసుకుని అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రం నుంచి వచ్చిన తాజా అదేశాల నేపథ్యంలో పునరాలోచనలో పడింది. దీంతో రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టులో నిర్వహించనున్నామని తెలిపింది. చివరి సెమిస్టర్ పరీక్షలు ఎ్టటి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహణ లేకుండా ఉత్తీర్ణులను చేయరాదన్న నిబంధనల నేపథ్యంలో ఈ విషయాన్ని పరీశీలించిన పిమ్మట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు, విద్యా సంస్థలకు పరీక్షలు నిర్వహించుకునేలా అనుమతులను జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఆగస్టు మాసంలో డిగ్రీ, పీజీ, బిటెక్, ఎంటెక్, ఎంబిఏ, ఎంసీఏ, బిఫార్మ సహా మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. అయితే ఈ పరీక్షల నిర్వహణ కేవలం చివరి సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే. దీంతో పరీక్షల నిర్వహించరాదని దాఖలైన పిల్‌పై ఈ నెల 9న హైకోర్టులో విచారణ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. తాజాగా యూజీసీ సైతం చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినందున అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వాటిని నిర్వహిస్తామని చెప్పనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. పరీక్షలు నిర్వహించాలంటే విద్యార్థులకు కనీసం రెండు మూడు వారాల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టులో పరీక్షలు జరపాలని నిర్ణయించారు.

క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపికైన విద్యార్థుల్లో ఆందోళన

 

అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజా అదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకోన్న పరిస్థితుల దృష్ట్యా.. తాము ఇప్పుడప్పుడే జాబ్స్ లో చేరేందుకు వీలు పడదని, దీంతో ఆలస్యమయ్యే కోద్ది పరిస్థితులు ఎలా మారుతాయోనన్న అందోళనకు క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపికైన విద్యార్థుల్లో నెలకోంది. ఇప్పటికే కంపెనీలు ఫోన్లు చేసి ఎప్పుడు చేరతారని అడుగుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పుడు చెన్నై, బెంగళూరు, పుణె తదితర నగరాల్లో కొలువుల్లో చేరినా మళ్లీ పరీక్షల కోసం రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles