COVID-19 | 207 fresh cases reported in AP ఏపీలో కరోనా విజృంభన.. గడిచిన 24 గంటల్లో 207 కేసులు..

Coronavirus latest updates covid tally in ap crosses 5600 mark with 80 deaths

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

207 new coronavirus cases were reported in Andhra Pradesh, this brings the total reported cases of coronavirus in Andhra Pradesh to 5636. Among the total people infected as on date, However 2559 have recovered and 80 have passed away.

ఏపీలో కరోనా విజృంభన.. గడిచిన 24 గంటల్లో 207 కేసులు..

Posted: 06/12/2020 03:34 PM IST
Coronavirus latest updates covid tally in ap crosses 5600 mark with 80 deaths

(Image source from: news.yahoo.com)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందకు పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు వేల మార్కును దాటాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడం అందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

గత కొన్ని రోజులుగా వందకు పైగా నమోదువుతున్న కేసుల సంఖ్య గడిచిన 24 గంటల వ్యవధిలో మరో రెండువందలకు పైగా చేరడంతో ఆందోళన వ్యక్తం అయ్యింది.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56 వేల మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో 207 కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 5636కి చేరాయి. అయితే ఇందులో విదేశాలకు, పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చెందిన కేసులు కూడా వున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 5636 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మరణాలు సంభవించకపోవడం వైద్యులకు ఊరటనిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 80కి చేరింది. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2559కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 1723గా నమోదు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles