Like food deliveries online petrol and CNG deliveries may start soon మద్యం తరువాత ఇక పెట్రోల్, సీఎన్జీ గ్యాస్ కూడా హోం డెలివరీ.!

Like food deliveries online petrol and cng deliveries may start soon

petrol delivery, cng delivery, home delivery, door step delivery, mobile app, diesel delivery, petrol online delivery, cng online delivery, Dharmedra pradhan

Just like you order food online from Zomato or Swiggy, you will soon also be able to order petrol using a mobile app. While the door-step delivery of diesel is already a reality, the delivery of petrol and CNG is not far behind.

మద్యం తరువాత ఇక పెట్రోల్, సీఎన్జీ గ్యాస్ కూడా హోం డెలివరీ.!

Posted: 06/01/2020 05:53 PM IST
Like food deliveries online petrol and cng deliveries may start soon

దేశంలో ఈ కామర్స్ సంస్థలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఆరంభంలో ఒకింత నత్తనడకన సాగిన ఆన్ లైన్ విక్రయాలు.. ఇళ్లు, కార్యాలయాల్లో కూర్చోనే తమకు కావాల్సిన  నిత్యావసరాలను, జిహ్వకు రుచించే విధంగా తమకు నచ్చిన ఆహారాన్ని నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు బాగానే పెరుగుతోంది. దీంతో షాపింగ్ అనగానే ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్లు గుర్తుకువస్తున్నాయి. వారి ఇచ్చే ఆపర్లు.. డెలివరీ తరువాత రిటన్ పాలసీలు కూడా కేంద్రం చక్కగా ఫ్రేం చయడంతో ఇప్పుడివే దేశప్రజలను చక్కగా ఆకర్షిస్తున్నాయి.

ఇక తాజాగా పెట్రోల్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్‌జీని) కూడా హోం డెలివరీ చేసేందుకు కేంద్రం త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు పెట్రోలియం మంత్రిత్వశాఖ సంకేతాలను వెలువరించింది. కారులో పెట్రోల్, సీఎన్జీ గ్యాస్ లేదని ఇక బంకు వరకు టోచన్ కట్టుకునో లేదా వేరే వాహనంలోనే వెళ్లాల్సిన అగచాట్లకు ఇకపై చీటిచెల్లనుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వాహనదారులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. 2018 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను‌ హోం డెలివరీ చేస్తోంది.

టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని స్టార్టప్‌ కంపెనీ రెపోస్ ఎనర్జీ.. మొబైల్ పెట్రోల్ పంప్‌ల తయారీకి ముందుకొచ్చింది. వాటి ద్వారా ఇంటివద్దకే పెట్రోల్‌ సరఫరా చేసే వీలు కలుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ, పీఎన్‌జీ వంటి అన్ని రకాలైన ఇంధనాలు ఒకే దగ్గర లభ్యమయ్యేలా ఇంధన స్టేషన్లను పునరుద్ధరిస్తామని మంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు. అలాగే వాటికోసం జనాలు బారులు తీరి ఉండకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నెలలో ఆయిల్ డిమాండ్ 70 శాతం తగ్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles