Shirdi Sai Trust faces loss of Rs 1.58 crores daily షిర్డీ సాయి దేవాలయానికి కరోనా కష్టం.. రోజూ రూ.1.58 కోట్ల నష్టం

Shirdi sai baba mandir trust faces loss of rs 1 58 crores daily due to lockdown

Coronavirus, Coronavirus India, Sai Baba Temple, Shirdi Sai Baba, india lockdown, Shirdi Temple, Shirdi Sai Sansthan Trust, SSST Loss coronavirus, India

Due to the coronavirus COVID-19 lockdown, the Sai Baba Mandir Trust at Shirdi has incurred a loss of more than Rs 1.5 crores daily. Since the closure of the temple, from March 17 to May 3, the temple trust has received Rs 2.53 crores and a few thousand rupees through online donations which is about Rs 6 lakhs daily.

షిర్డీ సాయి దేవాలయానికి కరోనా కష్టం.. రోజూ రూ.1.58 కోట్ల నష్టం

Posted: 05/06/2020 08:45 PM IST
Shirdi sai baba mandir trust faces loss of rs 1 58 crores daily due to lockdown

కరోనా వైరస్‌ మహమ్మారితో నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రాలు కూడా లాక్ డౌన్ లో భాగంగా మూసివేయబడ్డాయి. ఇక్కడకు చేరుకునే భక్తులకు ఎలాంటి అనారోగ్యం సంక్రమించకూడదని ఆలయాల ట్రస్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలకు భక్తులను అనుమతించడం లేదు. భక్తులు కూడా ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌ కారణంగా ప్రస్తుతం దేవాలయ నిర్వహణకు కూడా కష్టాలు ఎదుర్కోంటున్నాయి. తమ వార్షికాదాయాన్ని ఓ వైపు కోల్పోవడంతో పాటు భక్తుల కానుకలు, విరాళాల ద్వారా లభించే ఆదాయాన్ని కూడా కోల్పోతున్నారు.

అన్ని ఆలయాల దర్శనాలను నిలిపివేయటంతో పెద్ద మొత్తంలో ఆలయాల ఆదాయాలకు గండిపడుతోంది. అటు తిరుమల తరువాత ఆదాయంలో రెండవ స్థానాన్ని పోందిన షిర్డీ సాయిబాబా సంస్థాన్ మినహాయింపు కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షిర్డీ సాయి బాబా ఆలయం భక్తుల రాకపోకలు లేక బోసిపోవటమే కాకుండా నిత్యం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. షిర్డీ సాయి బాబా మందిర్‌ ట్రస్టు ప్రతిరోజూ 1.58కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోతోంది. మామూలుగా ప్రతీ సంవత్సరం విరాళాల ద్వారా దాదాపు రూ. 600 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 17నుంచి మే 3 వరకు కేవలం రూ.2.53 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి.

ఇక లభించిన ఆ విరాళాలు కూడా ఆన్‌లైన్‌ ద్వారా. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజు రూ. 1.60కోట్ల విరాళాలు వస్తుండగా.. ఇప్పుడా సంఖ్య రూ.6 లక్షలకు పరిమితమయింది.  ఒక వేళ జూన్‌ వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తే సాయిబాబా ఆలయం రూ.150 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇదే గనుక జరిగితే గుడి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలపై ఆ ప్రభావం పడనుంది. కాగా, కరోనా కారణంగా ప్రముఖ షిర్డీ సాయి బాబా ఆలయం మార్చి 17నుంచి బాబా దర్శనాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 8-9 మంది భక్తులు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా సాయిని దర్శించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles