AP BJP ripped off Vijay Sai Reddy విజయసాయిపై కన్నా ఫైర్.. ‘‘అవినీతితో జైలుకెళ్లిన చరిత్ర మరిచారా.?’’

Kanna lakshminarayana slams mp vijaya saireddy says to file defamation suit

containment zones, Corona cases, Coronavirus, COVID-19, kanna ripped off vijaya sai reddy, Kanna Lakshminarayana, Sujana Chowdary, Vijaya Sai Reddy, YSRCP, Rapid Testing kits, Andhra Pradesh, Politics

BJP's AP unit on its social media ripped Vijay Sai Reddy apart. Calling him "Suitcase Reddy", "Jailu Pakshi", "Aku Pakshi in politics", BJP's social media went onto dub him as 5 rupees artist. It even shot back at Vijay Sai Reddy saying that the time has come for his end.

విజయసాయిపై కన్నా ఫైర్.. ‘‘అవినీతితో జైలుకెళ్లిన చరిత్ర మరిచారా.?’’

Posted: 04/20/2020 04:20 PM IST
Kanna lakshminarayana slams mp vijaya saireddy says to file defamation suit

కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నారని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ స్వైరవిహారం చేస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలోనూ జగన్ ప్రభుత్వం.. కేవలం రాజకీయాల కోసమే పనిచేస్తోందని మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టింగ్‌ కిట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారని విమర్శించారు.

‘పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో కిట్ ధర 730 రూపాయలు ప్లస్ జీఎస్టీ అని ఇచ్చారు. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి  640 రూపాయలు అని చెబుతారు. సాక్షి పత్రికలో మాత్రం ఏప్రిల్ 9న కిట్ ధర 12 వందల రూపాయలకు మెడ్‌టెక్ జోన్‌లో తయారు చేస్తున్నట్లు వార్త రాశారు. మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రాశారు. టెస్టింగ్ కిట్లు కొనుగోలు విషయంలో ఇంత గందరగోళం ఎందుకు. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రూ.337 ప్లస్ జీఎస్టీ చొప్పున కొరియా నుంచి కొన్నారని కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు.

దీనిపై తాను ట్వీట్ చేస్తే గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు విజయసాయిరెడ్డి స్పందించారు. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి.. సూట్ కేసులు, బెయిల్ పిటీషన్లు మాత్రమే తెలిసిన వ్యక్తికి తనపై విమర్శలు చేసే నైతిక అర్హత వుంటుందా.? అని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేయటం ఆకాశంపై ఉమ్మి వేయటమేనని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విషయాల్లో గందరగోళం గురించి ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డికి ఎందుకు అందలా రియాక్ట్ అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయనకు వచ్చే కమిషన్ పోయిందని బాధపడుతున్నారా అని కన్నా మండిపడ్డారు.

చంద్రబాబు తనను కొన్నారని తప్పుడు మాటలు మాట్లాడుతారా?. తనను కొనే వారు పుట్టలేదని ఆయన తేల్చిచెప్పారు. ‘అధికార మదంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఈ విషయంలో క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నానని చెప్పిన ఆయన.. విజయసాయిరెడ్డి పై పరువు నష్టందావా వేస్తానన్నారు. ఏపీలో ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడేందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని చెప్పారు. అధికారం ఉందని కేసులు పెడతామని బెదిరిస్తారా? అంటూ ప్రశ్నించారు. మీరు చెప్పిన విషయాల్లో వాస్తవం ఏమిటని అడగడం తప్పా అని నిలదీశారు. దక్షిణ కొరియా కంపెనీ శాఖ ఢిల్లీలో ఉండగా... నామినేషన్ పద్ధతిలో కిట్లు ఆర్డర్ ఇవ్వటం ఏంటిని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles