Veerappan's close aide arrested in Karnataka వీరప్పన్ ముఠాలో కీలక సభ్యురాలు అరెస్ట్..

Veerappan s close aide stella mary arrested in karnataka

Veerappan close aide, Stella Mary, Stella Marie, sugarcane, elephants, Nallur village, Kollugal rural police, Chamarajanagar district, Karnataka, crime

Nearly 15 years since the forest brigand Veerappan died, one of his close accomplice has been arrested by Karnataka police. HD Anand Kumar, Superintendent of Police (SP) Chamrajnagar has confirmed that Stella Mary, (40) a close associate of Veerappan was arrested after 27 long years.

27 ఏళ్ల తరువాత.. వీరప్పన్ ముఠాలో కీలక సభ్యురాలు అరెస్ట్..

Posted: 02/04/2020 12:08 PM IST
Veerappan s close aide stella mary arrested in karnataka

చట్టం చేతులు చాలా పెద్దవి.. తాత్కాలికంగా తప్పించుకున్నా.. ఏదో ఒకరోజు తప్పక నేరస్థులను పట్టుబడతారన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఇక నేరాలకు పాల్పడుతున్న క్రమంలో మావటిల అండ చూసుకుని ఏనుగులను కూడా వినియోగించుకుని తమ గంధపు చెక్కల రవాణాను చేపట్టిన కరుడుగట్టిన స్మగ్లర్ వీరప్పన్ ముఠా గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరప్పన్ చనిపోయిన సుమారు 15 ఏళ్ల తరువాత అతడి ముఠాకు చెందిన కీలక సభ్యురాలిని అవే గజరాజులు పోలీసులకు పట్టించిన వైనమిది. అదెలా.. అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

దేశద్రోహానికి పాల్పడి.. విరప్పన్ మరణంతో అజ్ఞాతంలోకి వెళ్లి.. గత 27ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఆ ముఠాలోని కీలకసభ్యురాలు స్టెల్లా మేరీ ఎట్టకేలకు  పోలీసులకు చిక్కింది. కర్ణాటకలోని కోల్లైగళ్ క్రైం బ్రాంచ్ పోలీసులు చామరాజనగర్ జిల్లాలోని జాగెరి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. అమెను ఏనుగులు ఎలా పట్టించాయంటే.. కర్ణాటకలోని చామరాజనగర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గజరాజులు అక్కడి పంట పోలాలను తినేందుకు రావడంతో పాటు చెరుకు పంటను సర్వనాశనం చేస్తున్నాయి.

ఇదే పరిణామం పలు పర్యాయాలు ఉత్పన్నం కావడంతో అక్కడి పోలాన్ని కౌలుకు తీసుకుని చెరుకు పంట వేసిన స్టెల్లా మేరీ తనకు తెలిసిన విద్యను ప్రదర్శించింది. అదే తుపాకిని పేల్చడం. తనకు తెలిసిన ఈ విద్యతో ఏనుగులను బెదరగొట్టేందుకు అమె ప్రయత్నించింది. ఈ క్రమంలో అమె తుపాకి పేలుడుతో స్థానిక అటవీ ప్రాంతంలో చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పోలీసులకు పిర్యాదు చేసి.. అగ్నిమాపక దళాలతో మంటలను అర్పివేశారు. ఇక తుపాకీని కాల్చిందెవరు అన్న కోణంలో విచారణ చేపట్టి స్టెల్లా మేరీని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణ సందర్భంగా అమెకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. తుపాకి ఫైరింగ్ ఎలా వచ్చని పోలీసులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం తెలిసి ఖిన్నులయ్యారు. వీరప్పన్, అతడి ముఠాతో తనకు సంబంధాలు ఉన్నాయని, తాను వీరప్పన్ అనుచరురాలినని చెప్పింది. అంతేకాదు, తుపాకి, పేలుడు పదార్థాలను పేల్చడంలో శిక్షణ పొందానని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనకు 14 ఏళ్ల వయస్సు వున్నప్పుడే వీరప్పన్ అడవులకు తీసుకెళ్లాడని అమె చెప్పింది. తాను మైనర్ గా వున్నప్పుడే వీరప్పన్ ముఠా సభ్యుడు వెలియన్ తో తనకు వివాహం జరిగిందని అమె తెలిపింది.

కాగా, 1993లో జరిగిన పాలర్ పేలుడులో 22 మందిని హతమార్చిన ఘటనలో బాంబు పేలుడుకు పాల్పడిన తన భర్త వెలియన్ కూడా గాయపడ్డాడని, ఆ తరువాత గాయం మరింత పెద్దదై అనారోగ్యం పాలై మరణించాడని తెలిపింది. ఈ పరిణామాంలో తాను వీరప్పన్ ముఠాను, అడవిని వదిలేసి తన గ్రామానికి వచ్చేశానని తెలిపింది, అయితే వీరప్పన్ ముఠాలో సుమారు 18 నెలల పాటు అమె కొనసాగానని తెలిపింది. ఈ క్రమంలో ఆ తరువాత వేలు స్వామిని వివాహం చేసుకుని.. కొల్లుగళ్ రూరల్ పోలిస్ డివజన్ పరిధిలోని నల్లూర్ గ్రామంలో నివసిస్తున్నామని, బతుకుదెరువు కోసం జాగెరీ గ్రామంలోని పోలాన్ని లీజు తీసుకుని చెరుకు పంట వేశామని తెలిపింది. కాగా స్టెల్లా మేరీపై  ‘టాడా’ చట్టం కింద కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles