huge police forces in amaravati villages అమరావతి గ్రామాల్లో పోలీసుల పహారా.. వీడియో వైరల్..

Viral video huge police forces in amaravati villages

Indrakeeladri, kanakadurga devi, Vijayawada, padayatra, amaravati villagers, arrest, huge police force, netizens, farmer pleading help, Amaravati, Visakhapatnam, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Huge police force in Amaravati, took villages into thier grip by stoping the villagers agitations, demanding single capital. Amid Tensions in Amaravati area, now a video goes viral on net showing huge police forces and a farmer pleading help from 13 district farmers.

ITEMVIDEOS: అమరావతి గ్రామాల్లో పోలీసుల పహారా.. నెట్టింట్లో వీడియో వైరల్..

Posted: 01/10/2020 12:40 PM IST
Viral video huge police forces in amaravati villages

అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. రాజధాని కోసం తమ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తాము చేసిన త్యాగాలను సహృద్భావంతో అర్థం చేసుకోవాలని కోరుతూ గత 24 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి రైతులు సీఎం కాన్వాయ్ కు నల్లజెండాలు చూపడం.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించడంతో.. పోలీసు ఉన్నాతాధికారుల అంక్షితలతో స్థానిక అధికారుల మరింత అప్రమత్తమయ్యారు. ఆ తరువాత మళ్లీ ముఖ్యమంత్రి కి ఇలాంటి పరిణామాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు.

అయితే రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ సహా ప్రభుత్వ ప్రధాన విఫ్ పిన్నెల్లికి మాత్రం స్థానిక రైతులు నిరసన సెగలు తాకాయి. కారులో అమరావతికి చేరుకుంటున్న ఆయన కారును అడ్డగించిన రైతులు ఆయనను ఘెరావ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి.. వాళ్లు రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలేనని అరోపించారు. రైతులు మందుకొట్టి ఉద్యమాలు చేయడానికి వస్తారా.? అంటూ ప్రశ్నించారు. ఆ తరువాత జాతీయ రహదారులు దిగ్భదం.. మహాధర్నా.. చంద్రబాబు బస్సుయాత్ర.. జేఏసీ నేతల అరెస్టు.. ఇలా అమరావతి ప్రాంతంలో అనేక నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి.

నిరసన కార్యక్రమాల హోరు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇశాళ ఆయా ప్రాంతాల రైతులు తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి నిలువరిస్తున్నారు. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో వున్నాయిని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు ఓ గ్రామంలో మొహరించిన దృష్యాలను అక్కడి స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ విధంగా తమను పండగను దూరం చేస్తున్నారని, తమను అదుకోవాలని పిలుపునిస్తున్నారు.

అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఇంట్లోంచి కూడా బయటకు రానీయని పరిస్థితులు కల్పించి.. రాజన్న రాజ్యాన్ని ఎలా తీసుకోస్తారని రాజధాని ప్రాంత రైతులు పోలీసులను నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తమను అదుకునేందుకు 13 జిల్లాల రైతులు కలసి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట్లో వైరల్ గా మారింది. దీంతో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా ఈ పోలీసలు బలగాలపై స్పందించారు.

రాజధాని గ్రామాలు బోర్డర్ ను తలపిస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. పాకిస్థాన్ బోర్డర్ లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరని మండిపడ్డారు. అన్యాయంగా, పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని, యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. దీంతోపాటు, రాజధాని ప్రాంతంలో భారీ సంఖ్యలో కవాతు చేస్తున్న పోలీసుల వీడియోను షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles