Amaravati-India’s urban disaster: shekhar gupta అమరావతి అర్బన్ డిజాస్టర్: పాత్రికేయుడి విశ్లేషణ

Andhra s capital to be amaravati teaches about india s urban disaster says shekhar gupta

YS Jagan, Cabinet Meet, Perni Nani, Three Capitals, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Cut the clutter, Shekhar Gupta, theprint, Amaravati city project, indian disasters, indian urban planning, Amaravati project cost, mughal ruler Tughlaq, regional imbalance in India, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

Amaravati, the 33,000-crore capital city project of Andhra Pradesh is on standstill, caught in vicious provincial, Jagan VS Babu politics. In episode 352 of ThePrint’s #CutTheClutter, Shekhar Gupta explains the tragic politics ruining the ambitious project, some Tughlaqi ideas, and India's disastrous, west-east regional imbalance.

ITEMVIDEOS: అమరావతి అర్బన్ డిజాస్టర్: ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా

Posted: 12/28/2019 11:02 AM IST
Andhra s capital to be amaravati teaches about india s urban disaster says shekhar gupta

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, ‘ద ప్రింట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా జాతీయ విపత్తుగా అభివర్ణించారు. ముఫై మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ది చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాజెక్టు గత ఆరు నెలలుగా నిలిచిపోవడంపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన.. రాజధాని విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నెలకొల్పుతున్న సందిగ్ధత సముచితం కాదని అన్నారు.

ఇక మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన ఇది ముమ్మాటికి పిచ్చి, తుగ్లక్ చర్యేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాన్ని పునరుద్ధరించాల్సిందిగా జగన్ కు ప్రధాని మోదీ సూచించాలని అన్నారు. జగన్ స్థానంలో కనుక ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే చంద్రబాబు కంటే మరింత గొప్పగా అమరావతి నిర్మాణం ఉండేదన్నారు. ఈ మేరకు 20 నిమిషాల వీడియోను శేఖర్ గుప్తా పోస్టు చేశారు. అమరావతి రాజధాని విషయం రెండు పార్టీల మధ్య సమస్యగా మారిందని అరోపించారు.

అమరావతి నిర్మాణాన్ని అదృష్టంగా పేర్కోన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు.. మొత్తం దేశ ప్రయోజనాలు అక్కడ వున్నాయని గుర్తించాలని పేర్కోన్నారు. అభివృద్ది చెందిన కొత్త ఓడరేవులు, విమానాశ్రయాలన్నీ పశ్చిమ తీరంలోనే వున్నాయని, తూర్పు తీరం మాత్రం అభివృద్దిలో వెనకంజలో వుందని అన్నారు. దీంతో తూర్పు, పశ్చిమ తీరాల మధ్య తీవ్రమైన అసమానతలు ఉన్నాయని ఆయన పేర్కోన్నారు. అలాంటి వెనకంజలోని తూర్పుతీరంలో అవరావతి లాంటి బాహుబలి రాజధాని, గొప్ప నగర నిర్మాణం తలపెట్టడం అదృష్టంగానే భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే అందుకు భిన్నంగా అమరావతి పనులను నిలిపివేయడం తీవ్ర విపత్తుగా ఆయన పేర్కోన్నారు. రాజకీయ పార్టీల మధ్య ఏర్పడిన వైరి వైఖరి పాలనలో కనిపించడం సముచితం కాదని అన్నారు. పరిపాలనలో ప్రభుత్వాలు అన్ని ఒకే దారిని అనుసరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే పురోగాభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రతిపాదించడం సముచితం కాదని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు. చూస్తుంటే ఏపీ పాలకులపై తుగ్లక్ ప్రభావం బలంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.

అమరావతిలో మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారని, వారంతా కలిసి అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తారని, ఈ 60 ఏళ్లలో దేశంలోనే నిర్మించిన మొదటి గ్రీన్‌ఫీల్డ్ నగరం అవుతుందని అనుకున్నామని, కానీ దురదృష్టవశాత్తూ అది ఆగిపోయిందని శేఖర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులే కాకుండా విశాఖ, అమరావతిలలో హైకోర్టు బెంచ్‌లు పెడతామని చెబుతున్నారని,  వేసవిలో శాసనసభ సమావేశాలను విశాఖలో జరుపుతామని చెబుతున్నారని, ఇదంతా చూశాక తుగ్లక్ డబుల్ కెఫిన్‌తో 20 కప్పుల కాఫీ తాగి తీసుకున్న నిర్ణయంలా ఉందని శేఖర్ గుప్తా ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh