2 Mibors killed in Assam in CAB protests ‘‘అమరుడా నీకు సలామ్..’’ అన్న అస్సామీలు

Assam teenager killed in firing at cab protests buried amid high tempers

Anti-CAB Violence, Citizenship amendment bill, guwahati, police firing, Sam Stafford, Minor Martyr, amit shah, Citizenship amendment bill, Citizenship (Amendment) Bill 2019, BJP, Union Minister for Home Affairs, Amit Shah, Citizenship ammendment bill, CAB, Congress, Parliament, Nation, Politics

Sentiments against the amended Citizenship Act ran high on Friday at the burial of a 17-year-old youth who died in an alleged firing incident while he was returning from a protest venue, with many locals hailing him as a "martyr".

క్యాబ్ అల్లర్లు: ‘‘అమరుడా నీకు సలామ్..’’ అన్న అస్సామీలు

Posted: 12/14/2019 03:02 PM IST
Assam teenager killed in firing at cab protests buried amid high tempers

దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైందని పేర్కొంటూ.. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక వాతావరణం అలుముకున్న తరుణంలో పోలీసులు అందోళనకారులపై బులెట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇద్దరు మైనర్ బాలురు మరణించారు. వారిలో ఒకరు సామ్ స్టాపర్డ్. సంగీతాన్ని అమితంగా ఇష్టపడటంతో పాటు తాను కూడా డ్రమ్స్ వాయిస్తాడు బాలుడు. ఈ క్రమంలో అతని అభిమాన గాయకుడు వస్తున్నాడన్న వార్తలతో హుషారుగా వెళ్లిన బాలుడు.. పోలీసులు తుపాకీ తూటాలకు బలయ్యాడు.

‘నీవు అమరుడివయ్యావు. నీకు వందనం. జై అసోం’ అంటూ అశ్రునయనాలతో అతడికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఇక బాధితుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అసోంలో విషాధచాయలు అలుముకున్నాయి. అంతేకాదు విషన్నవాదనాల మాటున పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తమ పోరాటం కూడా వుందని, అది మరింత ఉదృతమవుతుందని అస్సామీలు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. మేఘాలయకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్‌ సైతం ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అసోంలోని నామ్‌గఢ్‌ ప్రాంతంలో నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకు ఓ కన్సర్ట్‌ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సామ్‌.. ఈ విషయం తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు. దీంతో అక్కడే వున్న పోలీసులు నిరసనకారుల్ని చెదరగోట్టేందుకు కాల్పులు జరిపడంతో సామ్ కుప్పకూలడు. అస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో ఇవాళ అతనికి నిర్వహించిన అంత్యక్రియల్లో అస్సోంలోని ప్రజలు, మేధావులు, నిరసనకారులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles