సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య కేసులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. మృతురాలి కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర శివార్లలో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. విద్యార్థినులు, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని పవన్ అభిప్రాయపడ్డారు.
ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్రంగా ఖండించింది. నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి దేశంలో లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాశవిక దాడులు జరుగుతుంటే పోలీసులు, అధికార వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోందని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా కామాంధుల దాహనికి బలైపోయిందని గుర్తుచేశారు.
ప్రియాంకను హతమార్చిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్షను వేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు కనీస భద్రత లేకుండాపోయిందని, దీనికి కేంద్రప్రభుత్వం తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి ఘటనలు జరకుండా ఉండాలంటే దోషులకు కఠిన శిక్షలు వేయాలని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలు చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను ఉరి తీసేంతవరకు తమ పోరాటం ఆగదని ఆశాదేవి తెలిపారు.
డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఘటన గురించి వింటుంటే నాడు తన కూతురికి జరిగిన ఘటనే గుర్తొస్తోందని సినీనటి ప్రత్యూష తల్లి పార్వతమ్మ బాధపడ్డారు. మహిళలు బయటకు వెళ్లినప్పుడు చాలా సమయస్ఫూర్తితో, తెలివిగా వ్యవహరించాలని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయాల్లో మహిళలు తమ తల్లిదండ్రులకు, సోదరులకు, సమీపంలో వున్న స్నేహితులకు లేదా పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, మరణశిక్ష విధిస్తే మహిళా లోకం ఆనందిస్తుందని, మనోనిబ్బరాన్ని పెంచుకుంటుందని, ప్రత్యూష ఛారిటబుల్ ట్రస్టు, మహిళల తరఫున కోరుకుంటున్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Dec 10 | జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. రాజకీయం కూడా వ్యాపారంగా మారిన నేటి తరుణంలో పవన్ కల్యాణ్ లాంటి నేతలు ప్రజలకు అవసరమని,... Read more
Dec 10 | దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ప్రకటన చేయడాన్ని భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే... Read more
Dec 10 | మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను హైదరాబాద్... Read more
Dec 10 | స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను... Read more
Dec 10 | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.... Read more