2 inter students killed in road accident ఇద్దరు నారాయణ ఇంటర్ కాలేజీ విద్యార్థుల మృతి

2 inter students killed in road accident in hyderabad

narayana inter collage, Inter students, Hostel, aramghar, road accident, birthday function, mahaboobnagar, Rajendranagar, Rangareddy, Crime

Two intermediate students were killed and seven other students were injured in a road accident near Aramghar crossroads here in the city on Thursday night. All the nine students were pursuing intermediate at Narayana junior college of Madhapur branch.

ఇద్దరు నారాయణ ఇంటర్ కాలేజీ విద్యార్థుల మృతి

Posted: 11/29/2019 10:49 AM IST
2 inter students killed in road accident in hyderabad

హైదరాబాద్ ఆరాంఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మాదాపూర్ లోని నారాయణ కళాశాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ నుంచి గత రాత్రి 9 మంది విద్యార్థులు అదృశ్యం కాగా, వారిలో ఇద్దరి మృతదేహాలు ఆరాంఘర్ సమీపంలో రోడ్డుపై కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ 9 మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. రాజేంద్రనగర్ లో ఉంటున్న తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వీరంతా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లారు.

వేడుకల అనంతరం తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోగా, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో మిగతా ఏడుగురికీ గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల అదృశ్యంపై గత రాత్రే నారాయణ కళాశాల సిబ్బంది మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

అంతేకాదు కాలేజీ హాస్టల్ పర్యవేక్షణపై కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. హాస్టల్ లో తమ పర్యవేక్షణలో పిల్లలు ఇంటర్ విద్యను అభ్యసిస్తే.. పోటీ ప్రపంచంలో మంచి మెరుగైన మార్కులను సాధిస్తారని చెప్పే కాలేజీ యాజమాన్యాల కల్లబోల్లి మాటలను నమ్మి ఎంతో మంది తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలను హాస్టల్ లో చేర్పించి.. లక్షల రూపాయాల ఫీజులను చెల్లిస్తున్నారు. అయితే విద్యార్థులు ఏదో విధంగా హాస్టల్ ను దాటుకుని వస్తున్నారన్న విషయాలు తెలిసినా.. యాజమాన్యాలు మాత్రం దానిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

విద్యార్థులు అదృశ్యమయ్యారని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో తమ పని ముగిసిపోయిందని భావిస్తే.. కోట్ల రూపాయలు వెచ్చింది భారీ ప్రకటనలు, ప్రచారాలు చేయించి విద్యార్థుల చేర్చుకోవడం ఎందుకో వారికైనా.. క్లారిటీ వుండాలి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లారంటే యాజమాన్య నిర్లక్ష్యపు ధోరణి ఇక్కడే ప్రస్పూటిస్తోంది. అయితే ఇద్దరు విద్యార్థుల నిండు నూరేళ్ల జీవితాన్ని బలిగొన్న రోడ్డు ప్రమాదఘటనతో ఈ విషయం బయటకు వచ్చింది కానీ.. ఇలా ఎంతమంది బయటకు వెళ్తున్నారోనన్న విషయమై ఇప్పటికైన యాజమాన్యాలు దృష్టిసారించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Cops parade bar dancers for safety check probe launched

  భద్రత కోసమే.. అభద్రతాభావంతో.. బార్ గర్ల్స్ వీడియో వైరల్..

  Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more

 • Buxar jail in delhi preparing hanging ropes for nirbhaya case convicts

  నిర్భయ దోషులకు అదే రోజున ముహూర్తం ఫిక్స్..?

  Dec 09 | అది 2012, డిసెంబర్‌ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more

 • Anam ramnarayana requests speaker to change his place

  ‘‘సీటు మార్చండీ అధ్యక్షా’’ నవ్వులు పూయించిన ఆనం రిక్వెస్ట్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more

 • Andhra pradesh government announces mega dsc for 7900 post

  నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more

 • Man dies in queue for subsidy onions in gudiwada

  వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

  Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more

Today on Telugu Wishesh