విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవ చారి గారు ఇక లేరు... Vishalandra ex Editor Chakravartula Raghavachari Passed Away

Vishalandra ex editor chakravartula raghavachari passed away

Vishalandra, Chakravartula Raghavachari

Vishalandra ex Editor Chakravartula Raghavachari Passed Away

విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవ చారి గారు ఇక లేరు...

Posted: 10/28/2019 12:22 PM IST
Vishalandra ex editor chakravartula raghavachari passed away

మన తెలుగు నట బహుముఖప్రజ్ఞ శాలి.. పలు భాషలపై పట్టు సాధించి తెలుగు దినపత్రికలలో తన దైన శైలిలో పాత్రికేయుల జీవనానికి వన్నె తెచ్చిన వ్యక్తి మన చక్రవర్తుల రాఘవ చారి గారు {విశాలాంధ్ర మాజీ ఎడిటర్}  తెలుగు, సంస్కృత మరియు ఆంగ్ల భాషల యందు మక్కువ  ఎక్కువ, ఎంతో అవగాహనా కలిగి ఉన్నారు.. ప్రముఖ పాత్రికేయులు, సీనియర్‌ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి  గారు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాఘవాచారిగారు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్ధుమ్‌ భవన్‌కు తరలించారు.  రాఘవాచారి పార్థివ దేహానికి సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. అలాగే ఆయన మృతిపట్ల సీపీఐ నేత రామకృష్ణ, విశాలాంధ్ర గౌరవ చైర్మన్‌ ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. అనంతరం విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు.

రాఘవ చారి గారు సాంప్రదాయ బ్రాహ్మణా కుటుంబంలో జన్మించారు. పువ్వు పుటగానేవ పరిమళిస్తుంది .. అలానే రాఘవ చారి గారు కూడా చిన్నతనం నుండే తన ప్రతిభను కనబరిచే వారు. పుస్తకాలతో బాగా సావాసం చేసేవరకు. పుస్తక ఆరాధనలో మైమరిచిపోయేవారు, జాలి మరియు కరుణ గుణాలు మెండుగా కలిగిన మనిషి. తన ఐదవ ఏటా నుండే సంస్కృతి సాహిత్యాల పై అభిమానం పెంచుకున్నారు.. ప్రబంధ గ్రంధాలను ,రామాయణ ,మహా భారతాలను చదివేవారు.. అతనికి తెలుగు, ఆంగ్లం, హిందీ  చెప్పడానికి ప్రత్యేకంగా ముగ్గురు భాష నిపుణులు ఉండేవారు.  రాఘవ చారి గారు ఆంధ్రప్రదేశ్ లోని పొన్నూరుకి సంస్కృతం నేర్చుకోవడానికి   వెళ్లారు .అచట అమితమైన మేధాశక్తిని  సంపాదించుకున్నారు. 1953 నుండి ఆయన వార్తాపత్రికలు చదవడం బాగా అలవాటు చేసుకున్నారు..అంతేకాకుండా ఆ పత్రికలోని విషయాలకు చలించిపోయేవారు.. వరంగల్ ప్రాంతానికి  వెళ్లి అక్కడ బి.స్సీ చదివారు అచట కొన్ని సంఘటనలకు  బాగా ప్రభావితులు అయ్యారు. అటు పిమ్మట ఉస్మానియా  విశ్వవిద్యాలయంలో రాసిన ఏ నట్రాన్సు  పరీక్షకు గాను  6  ర్యాంకు  సంపాదించారు..  ఇంజిరింగు రెండో సంవత్సరంలో ఉండగా ఆయనకు ఆ చదువు పై ఆసక్తి  సన్నగిలింది హైదరాబాద్ మహా నగరానికి తన గ్రాడ్యుయేషన్ మీ పూర్తీ చేసుకొని    వచ్చి లా కళాశాలలో చేరారు..విదార్థుల  కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు. పోను పోను తన జీవితానికి  పాత్రికేయ  వృతే సరి  అయినదిగా భావించిఋ. తన అడుగుల  చప్పుళ్లను వినిపించారు.

తన  జ్ఞాన  సమృద్ధిని ఒక్కొక్క పదజాలాల ఆసరాతో  మన  ముందుకు విసిరారు,తెలుగు భాష పై ఎన్నలేని ఆప్యాయతను కురిపించి మన దేశ గౌరవ రాహిత్యాన్ని శిఖర అంచులలో  నిలిపారు.  అంతే కాకుండా విశాలాంధ్ర పత్రికకు తన  జ్ఞానా కుసుమని  వెదజలారు.

అటువంటి  మహానుభావుడి లోటు మనం తీర్చలేనిది.. అయన ఆత్మకు శాంతిని చేకూరాలని మనమంతా అభిలాషిదాం. అంజలి ఘటిదం ఘటిదాం..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishalandra  Chakravartula Raghavachari  

Other Articles