Bishop shaming me on social media, alleges nun కేరళ నన్ అత్యాచార కేసు: నవంబర్ 11 నుంచి ట్రయల్

Kerala nun rape case sister anupama seeks justice from court

bishop franco mulakkal, kerala nun sexual assault case, jalandhar diocese, save our sisters, kerala nun case, Kerala, Crime

The Kerala nun, who had accused then bishop of Jalandhar diocese Franco Mulakkal of sexual assault, last week filed a complaint with the state women commission saying he and his supporters were allegedly shaming her through social media.

కేరళ నన్ అత్యాచార కేసు: నవంబర్ 11 నుంచి ట్రయల్

Posted: 10/24/2019 07:58 PM IST
Kerala nun rape case sister anupama seeks justice from court

కేరళలలోని ఓ చర్చి బిషప్ తనపై రెండేళ్ల పాటు పాల్పడిన అఘాయిత్యాన్నికి వ్యతిరేకంగా తాను ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంతో జుడీషియల్ రిమాండ్ నుంచి తాజాగా బెయిల్ పై వచ్చిన బిషప్ తన వ్యక్తిత్వాన్ని అగౌరవపర్చే విధమైన చర్యలకు పాల్పడుతున్నాడని అత్యాచార బాధితురాలైన నన్ అరోపిస్తొంది. తాజాగా నన్ చేసిన ఆరోపణలు కేరళలో కలకలం రేపుతున్నాయి. బిషప్ తో పాటు అమె సోషల్ మీడియా దిగ్గజమైన యూట్యూబ్, పలు వెబ్ సైట్లను కూడా తప్పబట్టారు.

కొట్టాయంకు చెందిన చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ 2014 నుంచి 2016 మధ్యకాలంలో తనపై ఏకంగా 13 పర్యాయాలు అత్యాచారం చేశాడని బాధితురాలు (43) అరోపించారు. పంజాబ్ లోని మిషనరీలకు సభ్యురాలిగా వ్యవహరిస్తున్న తనపై బిషప్ పాల్పడిన అఘాయిత్యంపై రాష్ట్ర, జాతీయ మహిళా సంఘానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే నిందితుడిపై పిర్యాదు చేసినా చర్యలు తీసుకోడానికి పోలీసులు వెనుకంజ వేయడంతో.. అమె న్యాయస్థానాన్ని అశ్రయించారు. దీంతో కోర్టు అదేశాల మేరకు అరెస్టు చేసిన పోలీసులు తరువాత బెయిల్ లభించడంతో వదిలివేశారు.

కాగా తాజాగా బాధితురాలు.. బిషప్ పై మరో అరోపణలు చేస్తోంది. తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సందర్భంగా రహస్యంగా తీసిన ఫొటోలను తాజాగా బిషప్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదును మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆమె ఆరోపణలపై విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అఘాయిత్యం నేపథ్యంలో తమ మధ్య జరిగిన సంబాషణలను కూడా బిషప్ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడం.. వాటిని వీక్షకులందరికీ అందుబాటులోకి ఛానెల్ తీసుకురావడంపై కూడా అమె అక్షేపణలు వ్యక్తం చేసింది.

ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు ఇచ్చిన అదేశాలను తుంగలో తొక్కుతూ.. పలు వైబ్ సైట్లు తన వ్యక్తిగత వివరాలతో పాటు తన ఫోటోలను కూడా ప్రచురించాయని అమె అరోపించారు. అత్యాచారం జరిపిన బిషప్ పై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాల్సిన వారు.. ఇలా చేయడంపై అమె పలు ప్రశ్నలు సంధించారు. అయితే బిషప్ కావాలని తన వ్యక్తిత్వంపై, క్యారెక్టర్ ను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాగా ఈ కేసు విషయంలో ఏర్పాటు చేసిన సిట్ న్యాయస్థానంలో చార్జిషీటును దాఖలు చేసిందని, నవంబర్ 11 నుంచి ఈ కేసులో ట్రయల్ ప్రారంభమవుతుందని ఎస్ఓఎస్ అధికార ప్రతినిధి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles