driver self-immolation in khammam ఆర్టీసీ సమ్మె: ఒంటికి నిప్పు పెట్టుకున్న డ్రైవర్..

Striking telangana rtc driver self immolation in khammam

TSRTC employee, TSRTC bus driver, TSRTC strike, telangana bus strike, tsrtc driver suicide attempt, Srinivas reddy, khammam driver suicide

It is alleged that Srinivas Reddy went into depression after Chief Minister Chandrashekar Rao announced the dismissal of TSRTC employees who went on an indefinite strike from October 5.

ఆర్టీసీ సమ్మె: సీఎం ప్రకటనతో మనస్తాపం.. డ్రైవర్ ఆత్మహత్యయత్నం

Posted: 10/12/2019 05:59 PM IST
Striking telangana rtc driver self immolation in khammam

సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్మికులను కలవరానికి గురి చేస్తోంది. ఖమ్మంలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.

అతడిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఖమ్మం పట్టణంలో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతం నిలిపివేశారనే వార్తలతో అతడు మరింత కుంగిపోయాడు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tsrtc  srinivas reddy  driver  self immolation  suicide attempt  khammam  Telangana  

Other Articles