inter-state high tech prostitution racket busted నగరం అడ్డాగా హైటెక్ వ్యభిచారం.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

Inter state high tech prostitution racket busted

police busted high tech sex racket in neredmet, police busted high tech sex racket in hyderabad, high tech sex racket in neredmet, high tech sex racket in hyderabad, inter state prostitution racket, inter state sex racket, Hitech sex racket, Inter state sex racket, High Tech Prostitution, Neredmet, Hyderbad, Telangana, Crime

Iinter-state high tech prostitution racket busted by Hyderbad police at neredmet. police arrested west bengal couple and sent for judicial remand.

నగరం అడ్డాగా హైటెక్ వ్యభిచారం.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

Posted: 10/12/2019 12:21 PM IST
Inter state high tech prostitution racket busted

హైదరాబాద్‌లో నగరాన్ని తమ అడ్డాగా మార్చుకుని హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ముఠాను గుట్టును పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రట్టు చేశారు, పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి యువతులను రప్పించి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఆటను నేరడ్ మెట్ పోలీసులు కట్టించారు. తమ కళ్లు గప్పి ఎలాంటి నేరాలు జరిగినా.. వాటిని ఎప్పటికైనా పసిగడతామని మరోమారు పోలీసులు నిరూపించారు.

నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో పశ్చిమ్ బెంగాల్ కు చెందిన దంపతులు హైటెక్ పద్దతిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రజియా, ఆమె భర్త సిరాజుద్దీన్ లు తమ ఇరుగుపోరుగు వారికి కూడా అనుమానం రాకుండా అత్యంత గుట్టుగా ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా సాగుతోన్న ఈ ముఠా కార్యకలాపాల గురించి పక్కగా సమాచారం అందుకున్న పోలీసులు వారి ఫ్లాట్‌పై దాడిచేశారు.

మల్కాజిగిరి ఎస్ఓటీ, నెరేడ్‌మెట్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నిర్వాహకులతో పాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ్ బెంగాల్ కు చెందిన నలుగురు మహిళలు కూడా పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి రూ.6,580 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, 36 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 370A, పిటా ఎక్ట్ కింద కేసు నమోదు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles