Former TV9 CEO Ravi Prakash arrested పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

Telugu content

Ravi Prakash, Actor sivaji, TV9 CEO, ABCD, Alanda Media, My Home Rameshwar, Megha Enggineering, Krishna Reddy, Banjara Hills police, Telangana, Andhra pradesh, Crime

Former TV9 CEO Ravi Prakash arrested by Banjara Hills police, on the complaint of misue of funds from ABCD media

పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

Posted: 10/05/2019 01:22 PM IST
Telugu content

టీవీ9 ఛానెల్ మాజీ సీఈవో రవి ప్రకాశ్ మరోమారు బంజారాహిల్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. రవిప్రకాష్ ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి తరలించి అక్కడ అతడ్ని విచారిస్తున్నారు. గతంలో ఆయన టీవీ9 సీఈఓగా వ్యవహరించిన సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో అయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఆయనపై నిధులు దుర్వినియోగం కేసులు కూడా నమోదైనట్లు సమాచారం.

ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు. నిధుల దారిమళ్లించిన రవిప్రకాశ్‌ అండ్‌ కోపై క్రిమినల్‌ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అలందా మీడియా నిర్ణయించడంతో సింగారావు ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేశారు. సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో పాటు ఏబీసీఎల్‌ మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్‌ మూర్తిపై బంజరాహిల్స్‌ పోలీసులు 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేశారు. అలాగే  డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్‌ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్‌ క్లిఫోర్డ్‌ పెరారీపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్‌ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్‌ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్‌ డ్రా చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Prakash  TV9 CEO  ABCD  Alanda Media  Banjara Hills police  Telangana  Crime  

Other Articles

 • Covid 19 update with 1018 new covid 19 cases telanganas tally surges past 17000 mark

  హైదరాబాద్ లో కరోనా విజృంభన: ఖాళీ అవుతున్న నగరం

  Jul 02 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు పదహేడు వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు.. ప్రతీ... Read more

 • Coronavirus cases in india tally crosses 6 lakh nearly 18 000 dead

  భారత్ లో కరోనా విజృంభన: 6లక్షలు ధాటిన కేసులు.. 17 వేలు దాటిన మరణాలు

  Jul 02 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత రెండురోజుల నుంచి కొద్దిగా తక్కువ... Read more

 • Coronavirus in ap 657 new covid 19 cases state tally crosses 15 thousand mark

  ఏపీలో కరోనా ఉదృతి.. ఒక్క రోజులో 657 కేసులు.. ఆరు మరణాలు

  Jul 01 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు... Read more

 • Ysrcp leader potluri vara prasad gets bail in threatening a neighbour case

  వైసీపీ నేత పీవీపీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట

  Jul 01 | ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేత, వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తాను విక్రయించిన విల్లా అధునీకరణ విషయంలో కొనుగోలుదారుల ఇంటిలోకి... Read more

 • Dgp gautam sawang clears air on interstate arrivals says restrictions will be continued

  అన్ లాక్ 2.0 మార్గదర్శకాలకు ఏపీలో బ్రేక్.. అనుమతి తప్పనిసరి..

  Jul 01 | ధేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. దేశ్యవ్యాప్తంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనుమతులు లభించింది. ఇక రాత్రి పూట ప్రయాణాలు చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోకూడదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ... Read more

Today on Telugu Wishesh