godess kanakadurgadevi in Sri Maha Lakshmi Devi avatar శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Sri kanaka durga devi atop indrakeeladri in sri maha lakshmi devi avatar

Dussehra, Sri Kanakadurga temple, Goddess Durga, Sri Maha Lakshmi Devi, Sri Lalitha Tripura Sundari Devi, Sri Annapurna Devi darshan, Indrakeeladri, stanacharyulu, temple chief priest, YS Jagan Mohan Reddy, devotees, Andhra pradesh

As part of nine-day long Navratri festival celebrations at Sri Kanakadurga temple atop Indrakeeladri hill today Goddess Durga will appear as Sri Maha Lakshmi Devi avatar on the Sixth day of the nine-day festival. The devotees are being allowed to take darshan from 3 am onwards.

శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Posted: 10/04/2019 10:07 AM IST
Sri kanaka durga devi atop indrakeeladri in sri maha lakshmi devi avatar

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే లైన్లలో బారులు తీరి ఉన్నారు. ప్రత్యేక పూజలు చేసిన మొక్కలు చెల్లించుకుంటున్నారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు అమితమైన పరాక్రమంతో డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.  

అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు.బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా... అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి.

తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అంతరార్థం. పురుషుడు ఎంత ధనవంతుడైనా, భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది. ఎటువంటి సంతృప్తినీ అది అందించదు. పురుషుడికి నిజమైన సంపద...ఇల్లాలు, ఆమె అందించే సహకారం మాత్రమే. లోకస్థితికారిణిగా, ధన, ధ్యాన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్మీలుగా వరాలు ప్రసా దించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహా లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని దర్శించటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం - శ్రీరంగ ధామేశ్వరీం - దాసీ భూత సమస్త దేవ వనితాం - లోకైక దీపాంకురాం - శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం -  త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ శ్రీ మహాలక్ష్మి అవతారంలో వున్న అమ్మవారిని భక్తజనకోటి ఆరాధిస్తారు. "యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. ఇవాళ శ్రీ మహాలక్ష్మీ దేవిని ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా" అనే మంత్రమును 108 మార్లు  ఈ రోజు జపిస్తే శుభం కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh