chandrababu house demolition begins in undavalli ఉండవల్లిలోని చంద్రబాబు అద్దె నివాసం కూల్చివేత

Chandrababu house demolition begins in undavalli

Chandrababu's house in Undavalli, Undavalli chandrababu house, chandrababu house demolition, Naidu, CM YS Jagan, TDP, YSRCP, Congress, andhra pradesh, Politics

Former Chief Minister and TDP chief Chandrabau Naidu was served notice yesterday to vaccate his house and within 72 hours the it was being demolished as the government authorities state that it is illegal construction on the banks of River Krishna.

ఉండవల్లిలోని చంద్రబాబు అద్దె నివాసం కూల్చివేత

Posted: 09/23/2019 10:45 AM IST
Chandrababu house demolition begins in undavalli

రాష్ట్రంలో ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే ఇవి జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలుగా వున్నా వాటిని తప్పగా పరిగణించని ప్రభుత్వాధికారులు.. ఇప్పుడు మాత్రం తప్పును ఎత్తిచూపిస్తున్నారు. ఈ విషయంలో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెనివాసం ఏర్పాటు చేసుకున్న ఉండవల్లిలోని ఇంటిని కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. చంద్రబాబు ఇంటితో పాటు మరో రెండు ఇళ్లను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు.  వారం రోజుల్లోగా కట్టడాలను ఖాళీ చేసి కూల్చి వేయాలని, లేకుంటే తామే ఆ పని చేస్తామని సీఆర్డీయే నుంచి గత వారం పలువురికి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయా భవన యజమానుల వాదనలు విన్న అధికారులు, వాటితో సంతృప్తి చెందక కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 31 కట్టడాలకు నోటీసులు జారీ కాగా, 20 మంది వాదనలు విన్న అధికారులు, 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నివాసంతో పాటు శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 బిల్డింగ్ లు, అక్వా డెవిల్స్ పేరిట ఉన్న ఓ కట్టడంతో పాటు, మరో మూడు అంతస్తుల భవనం కూడా ఉన్నాయని సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. సామాన్యనులు ఒక్క నిబంధనను తప్పినా.. మూడు చెరువులు నీళ్లు తాగించే అధికారులు.. అందినకాడికి అమ్యామ్యాలు  తీసుకుని ఇన్నాళ్లు అక్రమాలను కూడా సక్రమ నిర్మాణాలుగా ఎలా చెప్పారన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.

అమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఈ చర్యలు వుండాలి. అంతేకాని కేవలం టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఒక్కరిద్దరు చోటా ఉద్యోగులను మాత్రమే బలిపశువులను చేయడం సమంజసం కాదు. అయితే ఒక్క ఉండవల్లి కరకట్టపై వున్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగించడం కూడా సబబు కాదు. యావత్ రాష్ట్రంలోని అన్ని కరకట్టలపై జరిగిన నిర్మాణాలను, బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించాలి. అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్దని ప్రజలు విశ్వసిస్తారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబును ఆయన పార్టీకి చెందిన నేతలను మాత్రమే టార్గెట్ చేస్తే ప్రజల విశ్వాసాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  CM YS Jagan  TDP  YSRCP  Congress  andhra pradesh  Politics  

Other Articles