Indian Army diffuses Pakistan mortar shells in JK పాక్ మోర్టార్ షెల్స్ ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ

Indian army defuses 9 unexploded mortar shells fired by pakistan

Society, Mortar shells diffusion, Indian army diffuse mortar shells, Indian Army, Jammu and Kashmir, Poonch, Line of Control (LoC), indian army video, viral video, video viral

The Indian Army destroyed nine live 120mm mortar shells in Sandote, Basoni and Balakote villages of Balakote sector in Mendhar sub-division of Poonch district in Jammu and Kashmir.

ITEMVIDEOS: పాకిస్థాన్ మోర్టార్ షెల్స్ ను ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ

Posted: 09/19/2019 11:14 AM IST
Indian army defuses 9 unexploded mortar shells fired by pakistan

జమ్మూకశ్మీర్ విషయంలో ఇంటా, బయట విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ఆర్మీ ప్రతీకారంతో రగిలిపోతోంది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట కశ్మీర్ లోని భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలు లక్ష్యంగా దాడికి దిగుతోంది. ఇందులోభాగంగా ఇటీవల పూంఛ్ జిల్లాలోని పలు గ్రామాలు లక్ష్యంగా పాక్ మోర్టార్ షెల్స్ ను ప్రయోగించింది. వీటిలో కొన్ని పేలగా, మరికొన్ని పేలలేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది.

పూంఛ్ సెక్టార్ లోని సన్డోటే, బసోనీ, బాలాకోటే గ్రామాల పరిధిలో 9 మోర్టార్ షెల్స్( 120 ఎంఎం) స్వాధీనం చేసుకుంది. అనంతరం మెంధార్ ప్రాంతంలో ఓ గుంత తవ్విన భారత ఆర్మీ.. అందులో ఈ మోర్టార్ షెల్స్ ను  నిర్వీర్యం చేసింది. ఈ సందర్భంగా మోర్టార్ షెల్స్ పేలడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కంపించింది. ఈ వీడియోను మీరూ చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  mortar shells  pakistan  poonch  jammu and kashmir  viral video  

Other Articles

Today on Telugu Wishesh