vijayashanti slams TRS government on viral fever టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డ రాములమ్మ

Vijayashanti slams trs government on viral fever epidermic condition

congress campaign commitee chairman, congress leader vijayashanti, senior congress leader, Dengue fever deaths, viral fever deaths in telangana, swine flu deaths in Telangana, KTR, Harish Rao, Eetala Rajender, vijayashanti, congress leader, Dengue, viral fever, swine flu, deaths, Telengana, politics

Telangana Senior Congress leader and campaign committee chairman VijayaShanti slam TRS government and ruling party for doing politics even when viral fever looks epidermic in the state.

టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డ రాములమ్మ

Posted: 09/05/2019 08:31 PM IST
Vijayashanti slams trs government on viral fever epidermic condition

తెలంగాణ ప్రజలు రోగాల బారిన పడి యావత్ రాష్ట్రం అల్లాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారని, ఇక తెలంగాణలో పాలన అంతా అస్తవ్యస్తం అయ్యిందని అమె దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ మాటలను వల్లే వేసిన కేసీఆర్ రోగాల తెలంగాణగా మార్చేశారని అమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

గులాబీ జెండాలకు తామే బాస్‌లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటూ, ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని జనం డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోవాల్సింది పోయి.. ఆ సమస్యలను బూచిగా చూపి మంత్రి ఈటలను బలిపశువును చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని స్వయంగా ఈటల తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు వార్తలు వచ్చాయన్నారు.

జీహెచ్ఎంసీ, మునిసిపల్ వ్యవస్థలు ఇప్పటికీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రం వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం సందట్లో సడేమియాలా ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం అనుచరులతో కొబ్బరికాయలు కొట్టిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన ‘కేసీఆర్ అండ్ కో’ అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayashanti  congress leader  Dengue  viral fever  swine flu  deaths  Eetala Rajender  Telengana  politics  

Other Articles