Etala Rajender fires on rumours on his ministry మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

Etala rajender becomes emotional over spreading rumours on his ministry

Etela Rajender, ministry, BC quota, TRS, CM KCR, seperate state movement, Telangana, politics

Etela Rajender Emotional Speech Over Spreading Rumors On His Ministry, says he is the man who fought for Telangana from the formation of TRS under its flag.

ITEMVIDEOS: మంత్రి పదవి బిక్ష కాదని మంత్రి ఈటెల సంచలన వ్యాఖ్యలు

Posted: 08/29/2019 05:52 PM IST
Etala rajender becomes emotional over spreading rumours on his ministry

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని.. బతికొచ్చినోన్ని కాదని చెప్పారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్లం కాదని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందన్నారు. మంత్రి పదవి నుంచి తనను తప్పిస్తున్నారంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఈటల ఘాటుగా స్పందించారు.

‘ఈటల రాజేందర్ అనెటోడు తెలంగాణ గడ్డ మీద ఆత్మగౌరవంతో గల్తెత్తి బతికినోడు.. ఈ చిల్లరమల్లర వాళ్లకు భయపడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. ‘అసలోడెవ్వడో, నకిలోడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటది. దొంగలెవరో, దొరలెవరో.. తెలవాల్సిన అవసరం ఉంటది. రాజకీయాల్లో ద్రోహులెవ్వరో, మోసగాళ్లెవరో.. అసలు సిసలైన వాడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటది. నా 50 ఏళ్ల జీవితంలో నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా.. దొంగలు, మోసగాళ్లు ఒక్కసారి ద్రోహం చేస్తారు కావొచ్చు. కానీ, ధర్మాన్ని మాత్రం ఎవడూ మోసగించలేడు. న్యాయాన్ని మాత్రం కప్పిపుచ్చలేడు. ఇది మాత్రం సత్యం’ అని ఈటల అన్నారు.

‘గెలవగలిగే సత్తా ఉన్నోడిని, అమ్ముడు పోకుండా ఉన్నోడిని నేను నా భుజాల మీద పెట్టుకొని మోసే ప్రయత్నం చేస్తా. లేనిపోనివి చెబితే మాత్రం దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను మాట్లాడితే గంటలు మాట్లాడుతా. కానీ, నాక్కూడా ఎక్కడో బాధ ఉంది. అయితే.. ఈ బాధను నా నోటి నుంచి వినడం కాదు, ఎన్నడో ఒకనాడు అన్నీ తప్పకుండా బయటకొస్తాయి. ఎవడు ద్రోహో, ఎవడు వీరుడో తెలిసే రోజు వస్తుంది’ అని ఈటల బావోద్వేగంతో చెప్పారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని.. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని ఈటల చెప్పారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని తెలిపారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని.. ప్రజలే చరిత్ర నిర్మాతలని పేర్కొన్నారు. కుసంస్కారుల పట్ల, సొంతగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. తనది మొదటి నుంచి గులాబీ వర్గమేనని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  ministry  BC quota  TRS  CM KCR  seperate state movement  Telangana  politics  

Other Articles