modi government bold step says janasena మోడీ సాహసోపేత నిర్ణయమన్న పవన్.. విలీనం వుండదు..

Modi government bold step says janasenani pawan kalyan

article 35A, Article 370, pawan Kalyan, janasena, BJP, modi sarkar, narendra modi, amit shan, Nazir Ahmad Laway, MM Fayaz, PDP, Congress, JK, Ladakh, indian armed forces, Jammu and Kashmir, Kashmiri terrorists, mehbooba mufti, Modi Government 2.0, omar abdullah, Operation Kashmir, Pak sponsored terrorism, PM Narendra Modi

Jana Sena president Pawan Kalyan said scrapping of Articles 370 and 35-A was a courageous decision and expressed confidence that it would foster peace between India and Pakistan.

మోడీ సర్కార్ సాహసోపేత నిర్ణయమన్న పవన్.. విలీనం వుండదు..

Posted: 08/06/2019 12:10 PM IST
Modi government bold step says janasenani pawan kalyan

రాజ్యసభలో ఆమోదం లభించిన జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభిస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ తరపున స్పందించారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని, ఈ సందర్భంగా ప్రధాని మోదీని అభినందిస్తున్నానని అన్నారు. జమ్మూకాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం కూడా స్వాగతించాల్సిన పరిణామేనని అన్నారు.

అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్, చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ లను పునర్విభజన చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భారత్, పాక్ దేశాల మధ్య, కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని, దేశ సమగ్రత ఎంతో ముఖ్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశ యువత మాదిరగానే కాశ్మీర్ యువత కూడా తమ భవిష్యత్తు, ఎదుగుదలపై దృష్టిసారిస్తుందని ఆయన అకాంక్షించారు.

నా ఊపిరి ఉన్నంతవరకు జనసేన ఉంటుంది: పవన్ కల్యాణ్

జనసేన విలీనంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తన ప్రాణం పోయినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని స్పష్టం చేశారు. బీజేపీలో జనసేనను విలీనం చేస్తారంటూ కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కార్యకర్తలు, అభిమానులను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను ఓడించిన ఈ నేల నుంచే తనపై నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని పవన్ పునరుద్ఘాటించారు. టీడీపీతో జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారని పవన్ అన్నారు. తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని, ఏదైనా ఉంటే అందరికీ చెప్పే చేస్తానని పేర్కొన్నారు. పార్టీని నడపడానికి వేల కోట్ల రూపాయలు అవసరం లేదని, టన్నుల కొద్దీ ఆశయం ఉంటే చాలని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : article 35A  Article 370  pawan Kalyan  janasena  BJP  modi sarkar  narendra modi  amit shan  JK  Ladakh  politics  

Other Articles

  • Former mla chintamaneni prabhakar released from jail

    బెయిలుపై విడుదలైన చింతమనేని.. వైసీపీపై విమర్శలు..

    Nov 16 | టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు కావడంతో పాటు ఆయనపై మరో 18 కేసులు కూడా నమోదైన... Read more

  • Karnataka rebel mla mtb nagaraj s assets grew by rs 185 crore in 18 months

    బీజేపి ఎమ్మెల్యే అస్తుల చిట్టా చూసి అధికారులు షాక్.!

    Nov 16 | కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన నాయకుడు ఎం.టి.బి.నాగరాజు సంపాదన ఏడాదిన్నర కాలంలో ఎంత పెరిగిందో తెలిస్తే.. షాక్ అవ్వకతప్పదు. ఎందుకంటే వేయి కోట్ల రూపాయలకు పైగా ఆస్తులును... Read more

  • Ranjan gogoi to get z plus security in assam after his retirement

    రంజన్ గొగోయ్ కి జడ్ ప్లస్ భద్రత కొనసాగింపు

    Nov 16 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ నెల 17న తన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేకంగా తన చివరి పనిదినాన్ని ముగించుకున్న ఆయన..... Read more

  • Telangana liquor is on high sale than ap in bordering districts

    తెలంగాణ మద్యానికి పెరిగిన గిరాకీ.. ఎంతో రుచిరా.!

    Nov 16 | నిధుల లేమితో అంగలార్చుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనురుగా అవతరించిన మద్యాన్ని వదులేసుకుంది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మహిళా ఓటర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను నియంత్రిస్తూ కొత్త... Read more

  • Five arrested under pocso act in nagapattinam

    ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని.. స్నేహితులతో కలసి..

    Nov 16 | అభంశుభం తెలియని అమాయక అడపిల్లలను ప్రేమ పేరుతో లోబర్చుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా.. తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారం చేయించి.. గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. అరవ రాష్ట్రంలోని నాగపట్టణం... Read more

Today on Telugu Wishesh