6.8-magnitude earthquake strikes off of Indonesia సునామీ హెచ్చరికలను ఎత్తేసిన ఇండోనేసియా

One dead several injured after powerful quake rocks indonesia

INCOIS, Indian National Centre for Ocean Information Services, Indian Ocean, Indian Tsunami Early Warning Centre, Indonesia, ITEWC, Maldives, Myanmar, National Centre for Seismology, NCS, Sri Lanka, SSC Shenoi, Sumatra, Thailand

There is no tsunami threat to India following the high-intensity earthquake in Indonesia, a senior official said. According to the National Centre for Seismology (NCS), a 6.9 intensity quake hit southwest of Sumatra, Indonesia, at 5.30 pm

సునామీ హెచ్చరికలను ఎత్తేసిన ఇండోనేసియా

Posted: 08/03/2019 11:24 AM IST
One dead several injured after powerful quake rocks indonesia

ఇండోనేషియా రాజధాని జకార్తాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి ఒకరు మరణించి అనేక ఇళ్లు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకంపనలకు సునామీ కూడా సంభవిస్తోందని హెచ్చరికలను జారీ చేసింది. అయితే శుక్రవారం రోజు భారత కాలమానం ప్రకారం సాయంతం 5.30 గంటలకు సంభవించిన ప్రకంపనలతో జారీ చేసిన సునామీ హెచ్చరికలను శనివారం ఉదయం ఇండోనేషియా ప్రభుత్వం ఎత్తివేసింది.

మరోవైపు ఈ భూ ప్రకంపనలతో భారత్ కు సునామీ వచ్చే ప్రమాదమేమి లేదని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, భూప్రకంపనల ధాటికి బెంబేలెత్తిన ప్రజలు వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. సుమత్రా, జావా దీవుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉందని జియోలాజికల్ అధికారులు తెలిపారు. తొలుత సునామీ హెచ్చరికలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది.

ఇక, ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంత వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇండోనేషియాను భూకంపాలు కుదిపేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబరులో సులావెసి ద్వీపాన్ని భూకంపాలు కుదిపేశాయి. ఫలితంగా 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tsunami warning system  Tsunami  Services  Indonesia  Indian standard time  earthquake  

Other Articles