India successfully launches moon mission Chandrayaan చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం..

Chandrayaan 2 goes up successfully places satellite in orbit

chandrayaan 2 launch, chandrayaan 2, isro, sriharikota, chandrayaan, isro chandrayaan 2 launch, chandrayan, chandrayaan 1, chandrayan 2 details, k sivan

The ISRO got more than what it bargained with Chandrayaan-2 lifting off successfully at 2.43 p.m. from SHAR, and placing a satellite at an orbit 6,000 km more than what was intended.

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం.. శాస్త్రవేత్తలపై ప్రశంసలు

Posted: 07/22/2019 05:55 PM IST
Chandrayaan 2 goes up successfully places satellite in orbit

చంద్రయాన్-2 ను జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ముందుగా నిర్ణయించిన సమయానికే (మధ్యాహ్నం 2.43 గంటలకు) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్‌ నుంచి చంద్రయాన్-2 ను నింగిలోకి పంపింది. జులై 15న చేపట్టాల్సిన ఈ మిషన్ సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

జీఎస్ఎల్వీ ఎంకే3 వాహక నౌక నుంచి చంద్రయాన్-2 విడిపడి, భూకక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. జీఎస్ఎల్వీ పనితీరును మెరుగుపరచడం ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయగలిగామని శివన్ అన్నారు. ఇక ముందున్నది అసలు ప్రయోగమని కూడా ఆయన పేర్కోన్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్టో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

"ఈ రోజు చాలా చరిత్రాత్మకమైన రోజు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నా. చంద్రుడిపైకి భారత ప్రయాణానికి ఇది తొలి దశ. చంద్రుడిపై ఇంతవరకూ ఎవరూ పరిశోధించని ప్రాంతాలపై పరిశోధన జరిపే ఉద్దేశంతో చంద్రయాన్-2 ను ప్రయోగించాం. చివరి నిమిషంలో చాలా జాగరూకతతో సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని గతంలో ఆపేశాం. 24గంటల్లో దాన్ని సరిచేసి, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగానికి సిద్ధమయ్యాం. అహర్నిశలూ కష్టపడి పనిచేసే ఇస్రో సిబ్బంది, ఇంజనీర్లు, ఇతర విభాగాల సిబ్బంది కారణంగానే ఇది సాధ్యమైంది" అని శివన్ ప్రకటించారు.

చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చరిత్రలో నిలిచిపోయే ప్రత్యేక క్షణాలివి. సర్వం భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలతో చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయ్యిందని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా మన శాస్త్రవేత్తల సామర్థ్యం, 130 కోట్ల మంది సంకల్పాన్ని చాటిచెప్పాం. ప్రతి భారతీయుడూ ఈరోజు ఎంతో గర్విస్తున్నాడు.

''చంద్రయాన్ 2 ప్రయోగం భారతీయులందరికీ గర్వకారణం. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు శుభాకాంక్షలు'' అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. చంద్రయాన్ -2ను నింగిలోకి ప్రయోగించినట్లు ఇస్రో తన ట్విటర్ ద్వారా ప్రకటించింది. భారత్ తొలిసారిగా చంద్రుడి పైకి ఓ అంతరిక్ష నౌకను పంపేందుకు సిద్ధమైంది. చంద్రయాన్-2 విజయవంతమైతే, అంతరిక్ష కార్యక్రమాల్లో భారత్‌కు ఇది భారీ విజయమవుతుంది.

ఈ వాహకనౌక బరువు 2,379 కేజీలు. భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపైకి ఈ వాహక నౌక సెప్టెంబరులో చేరుతుంది. జులై 21 ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సరిగ్గా 20 గంటల పాటు సాగిన కౌంట్ డౌన్ తరువాత ఇవాళ గగన వీధుల్లను చీల్చుకుంటూ.. నింగిలోకి దూసుకెళ్లిన వాహననౌక నిర్ధేశిత కక్ష్యలోకి నిర్థిష్ట సమయంలో చంద్రయాన్-2 ను ప్రవేశపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrayaan 2  isro  sriharikota  chandrayaan  isro chandrayaan 2 launch  chandrayan  

Other Articles