ఎట్టకేలకు టీవీ9 చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్‌ను నిన్న ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం.
సైబర్‌క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మీడియాకు మాఫియాకు తెలుగు నెలమీద యుద్ధం జరుగుతోంది. మీడియా వైపు మేమున్నాం. ప్రజలంతా మీడియా వైపు ఉండాలి. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మీడియా కబ్జాకాండ కొనసాగుతోంది. దొంగ పత్రాలు సృష్టించి, పొలీసులు, రెవెన్యూ అధికారులు పేద రైతుల్ని ఒత్తిడి చేసి ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను ఆక్రమిస్తున్నారు. నాకు కొంత మంది మిత్రులు ఉన్నారు. వారంతా కలసి మోజో టీవీని నెలకొల్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈ లేకి తనాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి. మీడియా కబ్జాపై జర్నలిస్టులందరూ పోరాడాలి. ప్రజలందరూ మీడియా కబ్జాపై గళం ఎత్తాలని కోరుతున్నా’అని ముగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more