Heat wave warning along with lighting & rain in Telangana ఇటు భానుడి భగభగ.. అటు వరుణుడి ప్రకోపం..

Heat wave warning along with lighting rain in telangana

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, Rain, Lightening, heatwave, telangana, Andhra Pradesh

The Indian Meteorological Department (IMD) has issued a heat wave warning in Telangana along with lightening and Rain in some districts, But the Hyderabadis experiance high temperature and heat wave.

ఇటు భానుడి భగభగ.. అటు వరుణుడి ప్రకోపం..

Posted: 05/16/2019 11:59 AM IST
Heat wave warning along with lighting rain in telangana

ప్రచండ భానుడి ఉగ్రరూపంతో అల్లాడుతున్న తెలంగాణకు ఇవాళ కొంత ఉపశమనం లభించింది. ఇప్పటికే నిప్పుల కొలిమిలా ఉరిమిన భానుడి భగ భగలకు రాష్ట్రంలోని పలువరు ప్రాణాలను కోల్పోయారు. ఇక చాలిస్తాను అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకున్నాడు. దీంతో క్రమేపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే స్యూరుడు శాంతించగానే వరుణుడు ప్రకోపిస్తున్నాడు. తెలంగాణలోని పలు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో ఇన్నాళ్లు భానుడు తమ తలపై భగభగ మండుతూ నృత్యం చేస్తే.. ఇక వారుణుడు కుండపోత వర్షాలతో జనజీవనాన్ని స్థంభింపజేయడంతో పాటు పిడుగుల, ఉరుములతో భయభ్రాంతులను చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలంగాణ ప్రజలు అందోళన చెందుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, కరీంనగర్ తదితర కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మే 17 నుంచి మే 19 తేదీల్లో కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక మే 15వ తేదీ బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయని వెల్లడించింది. రామగుండం, హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.

హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోతతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రాలేనంతగా వేడి సెగ కొడుతోంది. బయటకు వెళితే..వడగాల్పుల బారిన పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మే 15వ తేదీ బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43.2  డిగ్రీలు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గడం లేదు. సాయంత్రం 4 గంటల తర్వాత నగరంలో ఈదురుగాలులతో ఎండ  వేడి తగ్గింది. అయినా గాలుల భయం మాత్రం ఉంది. నగరంలోని  ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శుభ్రంగా ఉన్న పానీయాలు  మాత్రమే తాగాలని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడం మంచిదని వైద్యులు  సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles