Two dead, at least five injured in Guwahati grenade blast గౌహతిలో బాంబు పేలుడుపై కేంద్రహోంమంత్రి ఆరా

Rajnath singh speaks to assam cm over guwahati blasts

guwahati blast, rajnath singh, sarbananda sonowal, ministry of home affairs, blast in guwahati mall, assam police, assam blast, assam, crime

Home Minister Rajnath Singh on Thursday spoke to Assam Chief Minister Sarbananda Sonowal regarding the blasts in Guwahati that left as many as 12 people injured.

గౌహతిలో బాంబు పేలుడుపై కేంద్రహోంమంత్రి ఆరా

Posted: 05/16/2019 10:34 AM IST
Rajnath singh speaks to assam cm over guwahati blasts

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అసోంలోని గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటన ఎలా సంభవించిందన్న కోణంలో ఆరా తీశారు. అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని సర్బానంద రాజ్ నాథ్ సింగ్ కు తెలిపారు. ఈ సందర్భంగా పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు.

కాగా గౌహతి నగరంలోని జూ రోడ్డులో షాపింగ్ మాల్ వెలుపల రాత్రి 8 గంటలకు జరిగిన గ్రెనెడ్ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గౌహతి పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ చెప్పారు. బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు అక్కడే పికెట్ నిర్వహిస్తున్న పోలీసులపై గ్రెనెడ్లు విసిరి పారిపోయారని కమిషనర్ దీపక్ కుమార్ తెలిపారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా  ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ గ్రెనేడ్ దాడి తామే చేసినట్లు యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ప్రకటించుకున్న విషయం తెలిసిందే. గువహాటి లో రద్దీగా  ఉండే జూ పార్కు రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఈ ఘటన సంభవించింది. గ్రెనెడ్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన వారిని గువహాటి లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాల కోసం ఘటనాస్థలంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guwahati blast  rajnath singh  sarbananda sonowal  ministry of home affairs  assam  crime  

Other Articles