dmk leader durai murugan meets chandrababu చంద్రబాబును కలిసిన డిఎంకే దూత దురై మురుగన్

Dmk leader durai murugan meets chandrababu

dmk leader durai murugan meets chandrababu, dmk leader durai murugan, AP CM chandrababu, Federal Front, latest political scenario, durai murugan, Andhra pradesh, Tamil Nadu, DMK, TDP, politics

dmk leader and party treasurer durai murugan meets chandrababu on the orders of his party chief Stalin, discusses about the latest updates of the political scenario.

చంద్రబాబును కలిసిన డిఎంకే దూత దురై మురుగన్

Posted: 05/14/2019 04:57 PM IST
Dmk leader durai murugan meets chandrababu

అమరావతిలో సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ దక్షిణాది రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పర్యాయం తమిళనాడుకు వెళ్లి అక్కడి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తో భేటీ అయిన 24 గంటల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు డీఎంకే దూతగా చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంచరించుకుంది. వీరి భేటీలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా స్టాలిన్-కేసీఆర్ భేటీ వివరాలను చంద్రబాబు దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఇదిలావుండే కేసీఆర్ ఆశలపై డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ నీళ్లు చల్లారు. ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామంలోకి రావాలని కేసీఆర్ తనను అహ్వానించలేదని, అసలు తమ మధ్య ఈ విషయమై చర్చ జరగలేదని అన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఫ్రంట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ చెన్నైకి రాలేదని స్టాలిన్ తెలిపారు.

తమిళనాడులోని పలు ఆలయాల సందర్శనకు ఆయన వచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో, మర్యాదపూర్వకంగా కలుద్దామని తన అపాయింట్ మెంట్ కోరారని తెలిపారు. మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. యూపీఏని బలోపేతం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ను కోరారని చెప్పారు. అవసరమైతే యూపీఏ ప్రభుత్వానికి మద్దతు కూడా ఇవ్వాలని తాను కోరినట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  durai murugan  latest political scenario  Andhra pradesh  Tamil Nadu  DMK  TDP  politics  

Other Articles