హాజీపూర్ లో వరుస అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ లో వందలాది మంది స్నేహితులు ఉండటం విశేషం. మొత్తం 327 మంది ఫేస్ బుక్ స్నేహితులు ఉండగా... వీరిలో 60 మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు. వీరిలో ఓ యువతితో నరహంతకుడు అత్యంత సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక ఫోటోనే శ్రీనివాస్ రెడ్డి తన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఆ యువతి శ్రీనివాసరెడ్డి ప్రియురాలిగా పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిలపై మానవరూపంలోని పైశాచిక మగంగా తెగబడే నిందితుడిలో ఈ కోణంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.
ఆడవారిపై తన పశువాంఛ తీర్చుకున్న తర్వాత కర్కశంగా అంతమొందించిన హాజీపూర్ సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి సంబందించిన మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నరగా తనతో చనువుగా ఉంటున్న ఓ యువతి విషయంలో మాత్రం అతను ఎలాంటి సైకో లక్షణాలు చూపకుండా ప్రవర్తించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. ముగ్గురు అమ్యాయిలపై అఘాయిత్యానికి తెగబడిన ఈ సైకో కిల్లర్ తన ప్రియురాలితో మాత్రం భిన్నంగా ప్రవర్తించడంపై పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఓ యువతితో చనువుగా ఉంటున్నాడు. ఆ యువతితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ అమ్మాయికి సంబంధించిన వివరాల గురించి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువతిగా గుర్తించారు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి వేములవాడలోనూ కొంత కాలం పనిచేసినట్లు ఆ క్రమంలో సదరు యువతితో ప్రేమలో పడినట్టు త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిందని తెలుస్తోంది.
అమ్మాయిలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన హాజీపూర్ సైకో కిల్లర్.. ఆ యువతితో మాత్రం అంత అదుపుగా ఎలా ఉండగలిగాడనేది చర్చనీయాంశంగా మారింది. దీన్ని పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పోలీసులు దర్యాప్తులో స్పష్టం చేసినట్లు తనను గ్రామంలోని అవమానించి.. చెప్పుతో కోట్టినందుకు మాత్రమే హాజీపూర్ గ్రామంలోని అమ్మాయిలనే టార్గెట్ గా చేసుకుని అత్యాచారం, హత్య చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడా.. అని పోలీసుల విచారణలో తేలాల్సివుంది. కాగా శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని రాచకోండ పోలీసులు భువనగిరి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more